న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల 20 ప్రపంచకప్‌.. పూనమ్ యాదవ్ సక్సెస్ వెనుకున్నదెవరో తెలుసా?!!

ICC Women’s T20 World Cup: Poonam Yadav Credits Harmanpreet Kaur For Her Success In The Tournament

మెల్‌బోర్న్: టీమిండియా మహిళా జట్టు స్టార్ లెగ్‌ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉంది. ఐసీసీ మహిళల 20 ప్రపంచకప్‌లో అద్భుతంగా చెలరేగుతన్న పూనమ్.. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లు వికెట్లను సునాయాసంగా తీస్తుంది. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును భారత జట్టు విజయాల్లో తన వంతు కృషి చేస్తోంది. పూనమ్‌ తొలి మ్యాచ్‌ నుంచి విశేషంగా రాణిస్తూ 9 వికెట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో ఆదివారం ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు అభిమానుల కళ్లన్నీ ఆమెపైనే ఉన్నాయి.

ధోనీ భవిష్యత్‌ ఏంటో నాకు తెలుసు.. అది చాలా రహస్యం: ఎమ్మెస్కేధోనీ భవిష్యత్‌ ఏంటో నాకు తెలుసు.. అది చాలా రహస్యం: ఎమ్మెస్కే

ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పూనమ్‌ యాదవ్ మీడియాతో మాట్లాడింది. 'ఈ టోర్నీలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంతో అండగా నిలిచింది. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో నేను వేసిన తొలి ఓవర్‌లో అలిస్సా హేలీ నాలుగో బంతికి సిక్స్‌ కొట్టింది. అప్పుడు హర్మన్‌ నా వద్దకు వచ్చి ఒకటే చెప్పింది. జట్టులో నువ్వు ఎంతో అనుభవజ్ఞురాలివి. నీ నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తున్నాం అని నాతో అంది. ఆ క్షణమే నాలో ఏదో ఉత్తేజం కలిగింది' అని పూనమ్‌ చెప్పింది.

'కెప్టెన్‌ నా పట్ల అంత నమ్మకం కలిగి ఉందంటే.. నేను కచ్చితంగా రాణించాలనుకున్నా. తర్వాతి బంతికే హేలీ వికెట్‌ పడింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడా సంఘటనను గుర్తు చేసుకుంటే నా వ్యక్తిగత ప్రదర్శన ఎంతో మెరుగైంది. నా విజయం వెనక హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. ఆమె మద్దతుతోనే నేను రాణించగలుగుతున్నా' అని పూనమ్‌ పేర్కొంది.

'మెగా టోర్నీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో నేను ఆడలేదు. అయినా సెలెక్టర్లు నాపై నమ్మకముంచి ఎంపిక చేశారు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు బ్యాటింగ్‌ చేసే విధానాలను వీడియోల్లో చూశా. దీంతో ఆయా క్రికెటర్ల బలహీనతల్ని తెలుసుకున్నా. అలా నా సన్నద్ధం బాగా జరిగింది. ఒత్తిడిని జయించి నేను బాగా రాణిస్తున్నా. ఫైనల్లో విజయం సాదించేందుకు ప్రయత్నిస్తాం' అని పూనమ్‌ చెప్పుకోచ్చింది.

ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ టైటిల్ పోరులో తలపడనుంది. ఆసీస్‌ వరుసగా ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతుండగా.. భారత్ మాత్రం తొలి సారిగా ఫైనల్‌ ఆడనుంది. తొలిసారి కప్‌ను గెలవాలని హర్మన్‌ప్రీత్ సేన ఉవ్విళ్లూరుతుండగా.. సొంత అభిమానుల మధ్య ఐదోసారి కప్‌ను ముద్దాడాలని మెగ్‌ లానింగ్‌ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్, జియో లైవ్ ద్వారా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Story first published: Saturday, March 7, 2020, 23:17 [IST]
Other articles published on Mar 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X