న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG Semi-Final Preview: ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకునేనా.. ఫైనల్ చేరెనా?

 ICC Women’s T20 World Cup 2020 Semi-Final 1 INDW vs ENGW Match Prediction

మెల్‌బోర్న్: మూడేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో.. రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకునేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌‌లో వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా.. ఇంగ్లండ్‌‌తో మరోసారి అమీతుమీ తేల్చుకోనుంది. గురువారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన భావిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా అజేయంగా సెమీస్‌ చేరగా... ఇంగ్లండ్‌ మాత్రం మూడు విజయాలతోనే ఇక్కడి వరకు వచ్చింది.

IPL 2020: భారీగా తగ్గిన ప్రైజ్‌మనీ.. ఎంతో తెలుసా?IPL 2020: భారీగా తగ్గిన ప్రైజ్‌మనీ.. ఎంతో తెలుసా?

 బ్యాటింగ్ మెరుగవ్వాలి..

బ్యాటింగ్ మెరుగవ్వాలి..

అయితే వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్‌కు ఒక విషయం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గెలిచిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ బౌలింగ్ బలంతో గట్టెక్కింది. వరుస విజయాలతో సెమీస్‌కు చేరినా కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌‌లో నిలకడలేమితో ఇబ్బందిపడ్డ టీమిండియా.. భారీ స్కోర్లు చేయలేకపోయింది. ఓపెనర్లు స్మృతి, షెఫాలీ మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నా.. మిడిలార్డర్‌‌ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఎలా ఆడిన సెమీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ చేయడం అవసరం. లేకుంటే మరోసారి భంగపాటు తప్పదు.

షెఫాలీ, మంధాన చెలరేగితే..

షెఫాలీ, మంధాన చెలరేగితే..

ఈ టోర్నీ‌లో ఇప్పటి వరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో యువ సంచలనం షెఫాలీ వర్మనే బ్యాటింగ్ బాధ్యతలనుమోసింది. లేడీ సెహ్వాగ్‌లా బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ స్కోర్లు అందించింది. 39,39,46,47 వరుసగా సూపర్ ఇన్నింగ్స్‌లతో 167 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా టాపార్డర్‌లో మంధాన, యువ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్ ప్రీత్ ఇక మిడిలార్డర్‌లో దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తాన్యా భాటియా కూడా తలా ఓ చేయివేస్తే టీమిండియాకు తిరుగుండదు.

సూపర్ బౌలింగ్..

సూపర్ బౌలింగ్..

తమ జట్టు బ్యాటింగ్‌తో సంబంధం లేకుండా భారత బౌలర్లు రాణించారు. సమష్టిగా చెలరేగుతూ స్పల్ప స్కోర్లను కాపాడి అద్భుత విజయాలందించినారు.

ముఖ్యంగా స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ అద్భుతంగా రాణించారు. ప్రత్యర్థులను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. వీరికి తోడు పేసర్‌ శిఖా పాండే కూడా అండగా నిలుస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించింది. ఇక నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా వీరు జోరు ఇలాగే కొనసాగితే భారత మహిళల కల ఖచ్చితంగా సాకారం అవుతోంది. ఇక శ్రీలంకతో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది.

పటిష్టంగా ఇంగ్లండ్..

పటిష్టంగా ఇంగ్లండ్..

గ్రూప్-బి నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్.. నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లో ఒకే మ్యాచ్ ఓడింది. సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆ జట్టు మిగత మ్యాచ్‌ల్లో అద్భుత విజయాన్నందుకుంది. కెప్టెన్‌ హీథర్‌ నైట్, వ్యాట్, బ్యూమౌంట్, స్కీవర్, అమీ జోన్స్‌లతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ఇప్పటికే 202 పరుగలతో స్కీవర్ టోర్నీ టాపర్‌గా ఉండగా.. హీథర్ నైట్ 193 పరుగులతో రెండో స్థానంలో ఉంది. వీరు చెలరేగితే భారత్‌కు కష్టమే. ఇక బౌలింగ్‌లో పేసర్లు స్కీవర్, ష్రబ్‌సోల్‌ మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం.

కలవరపెడుతున్న రికార్డులు..

కలవరపెడుతున్న రికార్డులు..

ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్లు 19 టి20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి.నాలుగింటిలో భారత్‌ గెలుపొందగా...15 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. ఇక ప్రపంచకప్‌ ముందు జరిగిన ముక్కోణపు సిరీసులోనూ 2 మ్యాచుల్లో పైచేయి సాధించింది.

తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తీ శర్మ, వేద కృష్ణమూర్తి, శిఖా పాండే, రాధా యాదవ్, రాజేశ్వర్ గైక్వాడ్, పూనమ్ యాదవ్

న్యూజిలాండ్:

హీథర్‌ నైట్(కెప్టెన్), ష్రబ్‌సోల్‌, వ్యాట్, బ్యూమౌంట్, కేథెరిన్ బ్రంట్, నటాలీ స్కీవర్, అమీ జోన్స్‌(కీపర్), ఫ్రాన్ విల్సన్, సోఫీ ఎకెల్స్‌స్టోన్, సారా గ్లెన్, మెడీ విలియర్స్

Story first published: Wednesday, March 4, 2020, 14:17 [IST]
Other articles published on Mar 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X