న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ కుమారుడు U19 వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా: ఎవరీ ప్రియమ్ గార్గ్!

U-19 World Cup 2020 : Priyam Garg Thanks His Father After Getting U-19 Captaincy || Oneindia Telugu
ICC U19 World Cup: India captain Priyam Garg, a school van drivers son, credits father for his achievements


హైదరాబాద్: చిన్నప్పుడు క్రికెట్ గేర్ కొనడానికి కూడా డబ్బుల్లేవు. అలాంటి అబ్బాయి ఇప్పుడు అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. అతడి పేరు ప్రియమ్ గార్గ్. అయితే, తాను ఈ స్ధాయిలో ఉండటానికి కారణం మాత్రం తన తండ్రి త్యాగాలే కారణమని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు తన కుమారుడి కలను నెరవేర్చడానికి ఓ స్కూల్ వ్యాన్ తండ్రి ఎంతో త్యాగం చేశాడు. 19 ఏళ్ల ప్రియమ్ గార్గ్ సోమవారం(డిసెంబర్ 2)న భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి జరగే అండర్-19 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు బీసీసీఐ సోమవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్‌తో కలిసి బుమ్రా వర్కౌట్లు (వీడియో)ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్‌తో కలిసి బుమ్రా వర్కౌట్లు (వీడియో)

మీరట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో

మీరట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో

మీరట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్విలా పరిక్షిత్‌గర్హ్ గ్రామానికి చెందిన ప్రియమ్ గార్డ్ తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో "నాన్న నరేష్ గార్గ్ స్కూల్ వ్యాన్ నడుతారు. నాకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. నేను కుటుంబంలో చిన్నవాడిని. ఇంత పెద్ద కుటుంబాన్ని చూసుకోవటానికి, నా క్రికెట్ కెరీర్‌కు మద్దతు ఇవ్వడానికి నాన్నకు తగినంత డబ్బు లేదు" అని అన్నాడు.

క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ, అంకితభావం చూసి

క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ, అంకితభావం చూసి

"క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ, అంకితభావం చూసి... నాన్న తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకొని నాకు క్రికెట్ కిట్ కొనివ్వడంతో పాటు నా కోసం కోచింగ్ ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. ఈ రోజు నా తండ్రి కృషి కారణంగా నేను అండర్ -19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను" అని గార్గ్ తెలిపాడు.

11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే

11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే

ప్రియమ్ గార్గ్‌కు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అతడి తల్లి మరణించింది. "నా తల్లి 2011లో మరణించింది. నేను టీమిండియాకు ఆడాలన్నది ఆమె కల. ఇప్పుడు నేను అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. ఇది చూడకుండానే ఆమె మరణించింది. ఇందుకు నేను చాలా చింతిస్తున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

రోజుకు 7-8 గంటలు క్రికెట్ ప్రాక్టీస్

రోజుకు 7-8 గంటలు క్రికెట్ ప్రాక్టీస్

"చదువు కొనసాగిస్తూనే రోజుకు 7-8 గంటలు క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని. మీరట్‌లోని నా కోచ్ సంజయ్ రాస్తోగి నాకు సహాయం చేసేవాడు. నా తండ్రి ప్రయత్నాల వల్లే నేను 2018లో రంజీ జట్టులో ఎంపికయ్యాను. సచిన్ టెండూల్కర్‌ను కలిసి అతని నుండి చిట్కాలు తీసుకోవడం నా కల. ఏదో ఒకరోజు టీమిండియా యొక్క నీలం రంగు జెర్సీని ధరించాలి" అని ప్రియమ్ గార్గ్ వెల్లడించాడు.

అగ్రశ్రేణి ఆటగాళ్లను

అగ్రశ్రేణి ఆటగాళ్లను

"యుపి క్రికెట్ మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, ఆర్‌పి సింగ్, ప్రవీణ్ కుమార్, కుల్దీప్ యాదవ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు భారత క్రికెట్‌ను అందించింది. కుల్దీప్ ఇంకా జట్టులోనే ఉన్నాడు. రాబోయే సంవత్సరాల్లో ప్రియామ్, ధ్రువ్ మరియు కార్తీక్ భారత జట్టులో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నా" అని ప్రియమ్ గార్గ్ తెలిపాడు.

800కుపైగా పరుగులు

800కుపైగా పరుగులు

ఉత్తర ప్రదేశ్ తరుపున 2018-19 రంజీ సీజన్ అరంగేట్రంలో ప్రియమ్ గార్గ్ 800కుపైగా పరుగులు చేశాడు. గోవాతో తన అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ, లిస్ట్ ఏ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. దేవధర్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన ఇండియా-సి జట్టులో సభ్యుడు కూడా.

అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా

అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా

అండర్-19 వరల్డ్‌కప్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో టీమిండియా ఒకటి. 2018లో జరిగిన చివరి ఎడిషన్‌తో సహా ఇప్పటి వరకు నాలుగు టైటిళ్లు గెలుచుకుంది. మోహమ్మద్ కైఫ్ (2000), ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (2008), పృథ్వీ షా (2018) టైటిళ్లను గెలవగా ఇప్పుడు ఆ బాధ్యతను ప్రియమ్ తన భుజాలపై వేసుకున్నాడు.

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు

అండర్-19 వరల్డ్‌కప్‌కు భారత జట్టు

ప్రియమ్‌ గార్గ్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ చంద్‌ జురెల్‌ (వైస్‌ కెప్టెన్‌, కీపర్‌), యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, దివ్యాన్ష్‌ సక్సేనా, శషావత్‌ రావత్‌, దివ్యాన్ష్‌ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తిక్‌ త్యాగి, అథర్వ అంకోలేకర్‌, కుమాల్ కుషాగ్ర, సుశాంత్‌ మిశ్రా, విద్యాధర్‌ పాటిల్‌.

Story first published: Tuesday, December 3, 2019, 19:20 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X