న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC U19 World Cup 2020: ఇంగ్లాండ్ మూడోసారి, పరుగుల పరంగా లంక!

 ICC U19 World Cup 2020: Statistical highlights from England and Sri Lankan wins on Monday

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు తమ గ్రూప్ స్టేజిలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలయ్యాయి. అయితే, గ్రూప్ స్టేజిలో ఆడిన చివరి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఘన విజయాన్ని అందుకోవడం విశేషం.

జపాన్‌ నిర్దేశించిన 93 పరుగుల విజయ లక్ష్యాన్ని 11.3 ఓవర్లలోనే చేధించి ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక, నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 306/7 స్కోరును నమోదు చేసింది. అనంతరం నైజీరియాను 17.3 ఓవర్లకే ఆలౌట్ చేసింది.

ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ టీమ్‌ను గుర్తించాం: బ్యాటింగ్ కోచ్ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ టీమ్‌ను గుర్తించాం: బ్యాటింగ్ కోచ్

ఈ క్రమంలో ఈ రెండు జట్లు నమోదు చేసిన రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం...

5 - ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జపాన్ జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మన్ డకౌటయ్యారు. ఈ విధంగా జరగడం ఇది మూడోసారి. 2008 అండర్ వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లను... ఆ తర్వాత 2018లో కెనడా జట్టులోని ఐదుగురు ఆటగాళ్లను ఇంగ్లాండ్ బౌలర్లు డకౌట్ చేశారు.


5/36 - నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుషణక నమోదు చేసిన గణాంకాలు. ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2014 తర్వాత శ్రీలంక తరుపున ఈ ఘనత సాధించి మొట్టమొదటి బౌలర్.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ వీడియో.. సాహసాలు చేస్తున్న విరాట్ కోహ్లీ!!ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ వీడియో.. సాహసాలు చేస్తున్న విరాట్ కోహ్లీ!!

7 - రవిందు రసంథ అండర్-19 వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన ఏడవ శ్రీలంక బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో రవిందు(102) పరుగులతో అజేయంగా నిలిచాడు.


231 - 231 బంతులు మిగిలుండగానే జపాన్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఇది మూడో అతి పెద్ద విజయం. 2008 వరల్డ్‌కప్‌లో బెర్ముడాపై ఇంగ్లాండ్ 236 పరుగులు మిగులుండగానే విజయం సాధించింది. ఇదే టోర్నీలో ఈ మ్యాచ్‌కి ముందు నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో 234 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది.


కుక్కలపై పందెం కాసేవాడ్ని.. అందుకే ఆ నిక్‌నేమ్ : రికీ పాంటింగ్కుక్కలపై పందెం కాసేవాడ్ని.. అందుకే ఆ నిక్‌నేమ్ : రికీ పాంటింగ్

233 - నైజీరియాపై శ్రీలంక జట్టు సాధించిన 233 పరుగుల విజయం అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు మూడో అతిపెద్ద విజయం. 2018 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక 311 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 419 పరుగులు చేసింది. 2017లో అండర్-19 ముక్కోణపు సిరిస్‌‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 240 పరుగుల తేడాతో విజయం సాధించింది.


1023 - యూత్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన శ్రీలంక ఆటగాళ్లలో నిపున్ ధనుంజయ మూడో స్థానంలో ఉన్నాడు. భానుకా రాజపక్సే (1040), అవిష్కా ఫెర్నాండో (1379) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

Story first published: Tuesday, January 28, 2020, 15:08 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X