న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC U19 వరల్డ్ కప్‌లో ఆస్టిన్ వా, థండో ఎన్తీని: క్రికెటర్ల వారసుల అరంగేట్రం

By Nageshwara Rao

హైదరాబాద్: క్రికెట్‌లో వారసులు వస్తున్నారు. క్రికెట్‌లో ఇది కొత్తేం కాదు. తమ తండ్రుల అడుగుజాడల్లో చిన్నప్పటి నుంచే క్రికెట్ ఓనమాలు దిద్దుకుని క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సరైన వేదికగా భావించే అండర్-19 వరల్డ్ కప్‌లో గతంలో కొంతమంది వారసులు మనల్ని అలరించారు.

తాజాగా, వచ్చే ఏడాది జనవరి 13న న్యూజిలాండ్ వేదికగా ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్‌వా తనయుడు ఆస్టిన్ వా, దక్షిణాఫ్రికా మాజీ పేస్‌బౌలర్ మకాయ ఎన్తీని తనయుడు థండో ఎన్తీని సత్తాచాటాలని తహతహలాడుతున్నారు.

ఆస్టిన్ వా

ఆస్టిన్ వా

ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన అత్యుత్తమ కెప్టెన్లలో స్టీవా వా ఒకడు. తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకుంటూ పిన్న వయస్సులోనే ఆస్టిన్ వా క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్‌షిప్‌లో సెంచరీ(122 నాటౌట్) సాధించడం ద్వారా ఆస్టిన్ వెలుగులోకి వచ్చాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఆస్టిన్ వా ఎదుర్కొన్న తీరు అద్భుతం. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న ఆస్టిన్.. అనతికాలంలోనే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. న్యూజిలాండ్‌లో మొదలయ్యే అండర్-19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఆస్టిన్ సారథ్యం వహించనున్నాడు.

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటతీరును అమితంగా ఇష్టపడతాడు. వరల్డ్ కప్‌కు ఎంపికైన నేపథ్యంలో ఆస్టిన్ వా మాట్లాడుతూ 'ప్రపంచంలోని ప్రతిభ కల క్రికెటర్లతో పోటీపడి నా సత్తా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే.. అత్యుత్తమ స్థాయిని అందుకోవడానికి ఇంకా ఎంత ప్రయత్నించాలన్న పట్టుదలతో ఉన్నాను. ఫార్మాట్ ఫార్మాట్‌కు ఆటతీరు మార్చుకుంటూ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలనుకుంటున్నాను' అని అన్నాడు.

థండో ఎన్తీని

థండో ఎన్తీని

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మకాయ ఎన్తీని తనయుడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన మకాయ ఎన్తీని తనదైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తండ్రిని అనుకరిస్తూ థండో ఎన్తీని కూడా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌తో జరిగిన అండర్-19 టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు తరుఫున జూనియర్ ఎన్తీని అద్బుత ప్రదర్శన చేశాడు.

కోహ్లీ దూకుడు అంటే ఇష్టం

కోహ్లీ దూకుడు అంటే ఇష్టం

'భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడును ఇష్టపడుతాను. అతనిలా మైదానంలో ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అంటూ కొట్లాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతాను. మూడేళ్ల నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. తండ్రిని అనుకరిస్తూ పేస్‌బౌలింగ్‌ నేర్చుకున్నాను' అని థండో ఎన్తీని అన్నాడు. తన తండ్రి లాగే కుడిచేతి ఫాస్ట్ బౌలర్ అయిన థండో.. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కావడం విశేషం. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈఓ జేమ్స్ సదర్లాండ్ కొడుకు విల్ సదర్లాండ్ కూడా ఆసీస్ అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Tuesday, December 26, 2017, 8:40 [IST]
Other articles published on Dec 26, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X