న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test rankings: కోహ్లీదే N0.1 స్పాట్, బౌలర్లలో టాప్ లేపిన బుమ్రా

ICC Test rankings: Virat Kohli consolidates No 1 spot, Ajinkya Rahane moves to eighth place

హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. శుక్రవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 928 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ తన NO.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన స్టీవ్ స్మిత్... కోహ్లీతో పోలిస్తే 17 పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు.

టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే 759 రేటింగ్ పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలవగా... భారత బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా 791 రేటింగ్ పాయింట్లతో తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది.

ఆ క్షణం భయమేసింది: బాల్ గర్ల్‌ను ఓదార్చి చెంపపై ముద్దు పెట్టిన నాదల్ (వీడియో)ఆ క్షణం భయమేసింది: బాల్ గర్ల్‌ను ఓదార్చి చెంపపై ముద్దు పెట్టిన నాదల్ (వీడియో)

ఇక, బౌలర్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 794 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా... రవిచంద్రన్ అశ్విన్ ఆరో స్థానంలో... పేసర్ మహ్మద్ షమీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సైతం టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 438 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన శ్రీలంక బ్యాట్స్‌మన్ ఏంజెల్ మాథ్యూస్‌కు టాప్-20లో చోటు లభించింది. డబుల్ సెంచరీతో ఎనిమిది స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో మాథ్యూస్ ఉత్తమ ర్యాంకు 3. దీనిని ఆగస్టు 2014లో సాధించాడు.

పాండ్యా హాఫ్ సెంచరీ వృధా: రెండో వన్డేలో ఇండియా-ఏ ఓటమి, 1-1తో సిరిస్ సమంపాండ్యా హాఫ్ సెంచరీ వృధా: రెండో వన్డేలో ఇండియా-ఏ ఓటమి, 1-1తో సిరిస్ సమం

తాజా ర్యాంకింగ్స్‌లో పోర్ట్ ఎలిజబెత్ టెస్టుని కూడా ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు శుక్రవారం నుంచి జోహెన్స్ బర్గ్ వేదికగా ప్రారంభమైంది.

పోర్ట్ ఎలిజబెత్‌లో అజేయంగా 135 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్ ఆలీ పోప్ 52 స్థానాలు ఎగబాకి 61వ స్థానానికి చేరుకోగా... సామ్ కుర్రాన్ మరియు డోమ్ సిబ్లీ వరుసగా నాలుగు స్థానాలు ఎగబాకి 64, 76వ స్థానాలను సొంతం చేసుకున్నారు. బెన్ స్టోక్స్ తన కెరీర్‌లో అత్యుత్తమ అల్ రౌండర్ ర్యాంకుని అందుకున్నాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్‌, విలియమ్సన్‌, టేలర్.. భారత్ టార్గెట్ 204ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్‌, విలియమ్సన్‌, టేలర్.. భారత్ టార్గెట్ 204

పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ 120 పరుగులతో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో స్టోక్స్ సాధించిన రెండో ర్యాంకుకు మళ్లీ తిరిగి వెళ్ళాడు. ప్రస్తుతం బెన్ స్టోక్స్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో... బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్నాడు.

Story first published: Friday, January 24, 2020, 15:54 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X