న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు ర్యాంకింగ్: దిగజారిన విరాట్ కోహ్లీ

ఐసిసి టెస్టు ర్యాంకింగ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో పాయింట్ కోల్పోయి నాలుగో స్థానానికి దిగజారాడు. కేన్ విలియమ్స్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

By Pratap

బెంగళూరు: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో స్థానం కిందకు పడిపోయాడు. మూడు నుంచి నాలుగుకు దిగజారాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాలుగు నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు, జో రూట్ రెండు నుంచి మూడుకు వచ్చాడు. సోమవారంనాడు ఐసిసి తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

అయితే ఆసిస్ కెప్టెన్ స్మిత్ ఇంతకు ముందు మాదిరిగానే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టుల్లో కోహ్లీ వరుసగా 0, 13, 12, 15 పరుగులు చేసి పాయింట్లు కోల్పోయాడు. అయితే దక్షిథాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ 130లతో రాణించి తన పాయింట్లు పెంచుకుని రెండుకు చేరుకున్నాడు.

ICC Test Rankings: Kane Williamson gains as Virat Kohli loses

కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా, భారత్ చెరో టెస్టు మ్యాచును గెలుచుకుని సిరీస్‌ను సమం చేసుకున్నాయి. మూడో టెస్టు మ్యాచు ఈ నెల 16వ తేదీన రాంచీలో ప్రారంభం కానుంది. భారత బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీని మినహాయిస్తే ఛతేశ్వర్ పుజారా మాత్రమే టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాడు.

ప్రస్తుత టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్ వివరాలు..

1) స్టీవ్ స్మిత్ - ఆస్ట్రేలియా - 936
2) కేన్ విలియమ్సన్ - న్యూజిలాండ్ - 869
3) జో రూట్ - ఇంగ్లండ్ - 848
4) విరాట్ కోహ్లీ - ఇండియా - 847
5) డేవిడే వార్నర్ - ఆస్ట్రేలియా - 794
6) ఛతేశ్వర్ పుజారా - ఇండియా - 793
7) అజర్ అలీ - పాకిస్తాన్ - 779
8) యూనస్ ఖాన్ - పాకిస్తాన్ - 772
9) హషీం ఆమ్లా - దక్షిణాఫ్రికా - 757
10) ఎబి డీవిల్లీర్స్ - దక్షిణాఫ్రికా - 747

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X