అప్గాన్ క్రికెటర్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల వేటు

Posted By:
ICC suspends Afghanistan wicketkeeper Mohammad Shahzad for two matches

హైదరాబాద్: ఐసీసీ నియమాల ప్రకారం మరో క్రికెటర్ రెండు మ్యాచ్‌ల నిషేదానికి గురైయ్యాడు. రాబోయే వరల్డ్ కప్ మ్యాచ్‌కు అఫ్ఘనిస్తాన్ జట్టు తరపు నుంచి ఎంపికైన మొహమ్మద్ షాజద్ సత్పప్రవర్తన లేమి కారణంగా నాలుగు డి మెరిట్ పాయింట్లతో సస్పెండ్ అయ్యాడు.

ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోఅఫ్గాన్ జట్టులో ఆడిన మొహమ్మద్ షాజద్ మాల్కోమ్ వాల్లర్ అనే బ్యాట్స్‌మన్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మంగళవారం జింబాబ్వేతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో జోరుమీదున్న షాజాద్ ఔటవడాన్ని సహించలేకపోయాడు. తన బ్యాట్‌తో పిచ్ పక్కన బలంగా బాదడంతో కొంతమేర దెబ్బతింది. దీనిని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో పిచ్, క్రికెట్ పరికరాలు, దుస్తుల దుర్వినియోగం తదితర వస్తువులను నాశనం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.

ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ ముందు తానే ఒప్పుకోవడంతో ఇక హియరింగ్‌కు కూడాసమయం లేకుండా పోయింది. ఈ పొరబాటుతో అతని ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్ చేరి మొత్తం 24 నెలల కాల వ్యవధిలో నాలుగు డీ మెరిట్ పాయింట్లు పూర్తి అయ్యాయి. దీంతో అతనిపై ఐసీసీ వేటు విధించకతప్పలేదు.

అంతకుముందు ఆడిన టీ20 లీగ్‌లో యూఏఈ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్ ఆడి మూడు డి మెరిట్ పాయింట్లు గురైయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం అతను మరో నాలుగు డీ మెరిట్ పాయింట్లు తెచ్చుకుంటే అంతనికి నాలుగు మ్యాచ్‌ల వరకు నిషేదానికి గురి కావాల్సిందే. ఈ నేరానికి అతనికి మ్యాచ్ ఫీజులో వంద శాతాన్ని జరిమానాగా, రెండు మ్యాచ్‌ల నిషేదాన్ని ఐసీసీ విధించింది.

ఈ కారణంగా షాజాద్ అఫ్గాన్ జట్టు హాంగ్‌కాంగ్, నేపాల్ జట్లతో జరగనున్న మ్యాచ్‌లకు దూరమైయ్యాడు. ఈ మ్యాచ్‌లు మార్చి 8, 10న జరుగుతుండటంతో అతని నిషేద గడువు త్వరగానే పూర్తవనుంది. ఇతనితో పాటుగా అదే జట్టుకు చెందిన ముజీబ్ రెహమాన్‌ కూడా ఐసీసీ నిషేదానికి గురైయ్యాడు.

Story first published: Thursday, March 8, 2018, 11:46 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి