న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సింగపూర్‌లో ఐసీసీ సమావేశం: టీ20 లీగ్‌లపై నిబంధనలు కఠినతరం

ICC set to impose tougher sanctions for mushrooming T20 leagues

హైదరాబాద్: సింగపూర్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న ఐసీసీ సమావేశంలో అనేక విషయాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ-20, టీ-10లపై కఠిన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ ఐసీసీ సమావేశాల్లో ఈ అంశమే కీలకం కానుంది.

ఐపీఎల్ తరహాలో సొంత టీ20 లీగులు ఎక్కువ కావడంతో క్రికెట్‌లో అవినీతికి ఆస్కారమేర్పడుతోందని భావిస్తున్న ఐసీసీ.. వాటి నిరోధానికి చర్యలు చేపట్టాలనుకుంటోంది. ఇప్పటికే పలు లీగుల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఆటగాళ్లపై నిషేధం విధించిన దాఖలాలు ఉన్నాయి. ఇకపై అలాంటి లీగ్‌ల అనుమతులకు కఠిన నిబంధనలు విధించాలని యోచిస్తోంది.

అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సైతం ఇటీవలే దుబాయి వేదికగా ఆప్ఘనిస్థాన్ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) పేరిట సొంత టీ20 లీగ్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మంగళవారం నుంచి జరిగే సమావేశాల్లో

మంగళవారం నుంచి జరిగే సమావేశాల్లో

"టీ20 లీగ్‌ల నిబంధనలు, ఆటగాళ్లను విడుదల చేయడం గురించి మంగళవారం నుంచి జరిగే సమావేశాల్లో ప్రధానంగా చర్చించాల్సి ఉంది. డాక్యుమెంటేషన్‌, నిర్వాహకులు, నిధులు సమకూరుస్తోంది ఎవరు? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ లీగ్‌లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది" అని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌‌ అలార్డిస్‌ అన్నారు.

 ఇకపై నుంచి లీగ్‌లకు సంబంధించిన నిబంధనలు కఠినతరం

ఇకపై నుంచి లీగ్‌లకు సంబంధించిన నిబంధనలు కఠినతరం

"దీంతో ఇకపై నుంచి లీగ్‌లకు సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయి. స్వదేశంతో పాటు ఐసీసీ నుంచి నిర్వాహకులు అనుమతి పొందడం తప్పనిసరి" అని ఆయన తెలిపారు. దీంతో పాటు అలాగే ఐసీసీ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ విధి విధానాలు, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ప్రవేశపెట్టడం, తదితర అంశాలపైనా చర్చించనున్నట్లు తెలిపారు.

2,028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై కూడా చర్చ

2,028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై కూడా చర్చ

"2019 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ప్రారంభం కానున్న వన్డే, టెస్టు ఛాంపియన్‌ షిప్‌ల మౌలిక రూపం, పాయింట్ల కేటాయింపు గురించి చర్చించాల్సి ఉంది. దాంతో పాటు 2,028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై చర్చిస్తారు. ఈ విషయంపై గత సమావేశంలోనూ మాట్లాడారు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

తొలిసారి ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ స్థానంలో

తొలిసారి ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ స్థానంలో

పెప్సీకో మాజీ సీఈవో ఇంద్రానూయి తొలిసారి ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ స్థానంలో ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీని అంతర్జాతీ య క్రికెట్‌ మండలి (ఐసీసీ) భేటీకి హాజరు కావొద్దని బీసీసీఐ పాలకుల కమిటీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఆదేశించారు. దాంతో జోహ్రీ స్థానంలో బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌధురి భారత ప్రతినిధిగా ఆ సమావేశాలకు హాజరుకానున్నారు.

Story first published: Tuesday, October 16, 2018, 9:09 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X