నీషమ్, రాహుల్ గొడవ.. అదిరే పంచ్ ఇచ్చిన ఐసీసీ!!

IND VS NZ 2020 : ICC Hilarious Replay On James Neesham’s Tweet

దుబాయ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్‌తో గొడవ పడిన విషయం తెలిసిందే. మైదానంలో మాటల యుద్ధం చేసుకున్న ఈ ఇద్దరూ.. మ్యాచ్ అనంతరం ట్విటర్ వేదికగా మరోసారి రెచ్చిపోయారు. అయితే మైదానంలో లాగా మాటలతో కాకుండా సరదాగా ట్వీట్‌ల ద్వారా సంభాషించుకున్నారు.

మరో చరిత్ర సృష్టించిన ఆంధ్ర మాజీ క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మి!!

ఐసీసీ ఫన్నీ కామెంట్:

నీషమ్, రాహుల్ గొడవకు సంబందించిన ట్వీట్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నీషమ్, రాహుల్ గొడవపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా స్పందించింది. నీషమ్, రాహుల్ సరదాగా ట్వీట్‌లు చేసుకున్నట్లే.. ఐసీసీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ సరదా కామెంట్ చేసింది. ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో నీషమ్ పోస్ట్‌ను రీట్వీట్ చేసి ఇలా రాసింది. 'బహుశా మేము సూపర్ ఓవర్‌కు బదులుగా (పేపర్, కత్తెర, బండరాయిని) దీన్ని చేద్దామా?' అని రాసుకొచ్చింది.

 ఐసీసీపై విమర్శలు:

ఐసీసీపై విమర్శలు:

సూపర్ ఓవర్ గురించి ఇటీవల చాలా చర్చలు, గొడవలు జరిగిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్, సూపర్ ఓవర్ టై కావడంతో ఎక్కువ బౌండరీలు (ఫోర్లు మరియు సిక్సర్లు) బాదిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ తరువాత ఐసీసీపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ఐసీసీ కొన్ని నిబంధనలను సర్దుబాటు చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఇలా సరదా కామెంట్ పెట్టింది.

రాహుల్ వాగ్వాదం:

రాహుల్ వాగ్వాదం:

మూడో వన్డేలో రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నీషమ్‌ పరుగు తీయకుండా అడ్డు వచ్చాడని రాహుల్ వాగ్వాదానికి దిగాడు. బంతిని మిడాన్ దిశగా నెట్టిన రాహుల్ సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో నీషమ్ వెనక్కి అడుగులు వేసుకుంటూ రాహుల్‌కి అడ్డుగా వెళ్లాడు. దీంతో అతన్ని ఢీకొట్టబోయిన రాహుల్.. అప్రమత్తమై తన దారిని మార్చుకుని సింగిల్ పూర్తి చేశాడు. ఆ వెంటనే ఆగ్రహంతో నీషమ్ దగ్గరికి వెళ్లి.. అడ్డొస్తే పరుగెలా తీయాలని ప్రశ్నించాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

రాహుల్ కొన్ని పరుగులు దాచుకో:

రాహుల్ కొన్ని పరుగులు దాచుకో:

ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ అయ్యాయి. ఈ వ్యవహారం నెట్టింట హల్‌చల్ చేయడంతో జేమ్స్ నీషమ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. తొలుత ‘రాహుల్ అన్ని పరుగులు ఇప్పుడే చేయకు.. ఏప్రిల్ ఉంది సుమా.. కొన్ని దాచుకో' అంటూ రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ సరదాగా ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఈ గొడవకు సంబంధించిన ఫొటోకు ‘పేపర్, కత్తెర, బండరాయి' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశాడు.

 అప్పుడే తేల్చుకుందాం..

అప్పుడే తేల్చుకుందాం..

జిమ్మీ ట్వీట్‌కు రాహుల్ కూడా సరదాగా స్పందించాడు. ‘ఈ గొడవను ఏప్రిల్‌లో పరిష్కరించుకుందాం.. సీ యూ' అంటూ ట్వీట్ చేశాడు. మైదానంలో ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్న ఆటగాళ్లు మ్యాచ్ అనంతం సరదాగా సంభాషించుకోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, February 13, 2020, 10:25 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X