న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ అభిమానులకు ఐసీసీ కఠినమైన ప్రశ్న..?

ICCs question on long-haired MS Dhoni leaves fans bewildered

న్యూఢిల్లీ: కరోనా పుణ్యమా క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో ఫాంటసీ క్రికెట్, ఇన్‌స్టా లైవ్ సెషన్స్, క్రికెట్ క్విజ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాదాపు అన్ని స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ తమ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం వేదికగా అభిమానుల క్రికెట్ నాలెడ్జ్‌ను పరీక్షిస్తున్నాయి. చివరకు ఐసీసీ కూడా అదే తరహా ప్రశ్నలతో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులను టార్గెట్ చేస్తూ ఓ కఠినమైన ప్రశ్నను ట్వీట్ చేసింది.

ఈ ఫొటోలు ఎప్పటివి?

ఫ్లాష్‌బ్యాక్ ఫ్రైడే హాష్ ట్యాగ్‌తో ధోనీ, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌లకు సంబంధించిన త్రోబ్యాక్ ఫొటోలను షేర్ చేసిన ఐసీసీ.. ఈ ఫొటోలు ఎప్పడివో చెప్పాలని ప్రశ్నించింది. ఈ ఫొటోలకు ‘ఏ ఐసీసీ టోర్నీకి సంబంధించిన హెడ్ షాట్స్(ఫొటోలు) ఇవి? ముఖ్యంగా నవ్వు ముఖం, ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న వ్యక్తి ఫొటో ఎప్పటిది? అని క్యాప్షన్‌గా పేర్కొంది.

జుట్టు పీక్కుంటున్న అభిమానులు..

జుట్టు పీక్కుంటున్న అభిమానులు..

ఈ చిక్కుముడి ప్రశ్నతో ధోనీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ నెత్తికొట్టుకుంటున్నారు. ఒక్కొకరు ఒక్కో జవాబు చెబతున్నారు. ఫొటోలోధోనీ జుంపాల జట్టుతో ఉండటంతో అతని కెరీర్ ప్రారంభంలోనిదేనని స్పష్టం తెలుస్తుంది. దీంతో 2006 చాంపియన్స్ ట్రోఫీ అని ఒకరు.. 2007 ప్రపంచకప్ అని మరొకరు.. 2007 టీ20 ప్రపంచకప్ అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక అవేవి కావని 2006-07 ఇంగ్లండ్‌లో భారత పర్యటనకు సంబంధించినవని, 2009 చాంపియన్స్ ట్రోఫీ అని ఇంకొందరూ ట్వీట్ చేస్తున్నారు.

జవాబు ఏంటంటే..?

జవాబు ఏంటంటే..?

అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం 2006 ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ'. ఈ టోర్నీకి సంబంధించిన ఫొటోలనే ఐసీసీ షేర్ చేసింది. ఇక భారత్ వేదికగానే జరిగిన ఆ మెగాటోర్నీలో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత్ సెమీస్‌కు కూడా అర్హత సాధించలేదు. ఇక మెగాటోర్నీ టైటిల్‌ ఫైట్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ఆసీస్ కైవసం చేసుకుంది. మరుసటి ఏడాదే జరిగిన ప్రపంచకప్‌ను కూడా ఆసీసే గెలిచింది. ఇక భారత్ లీగ్ స్టేజ్ కూడా దాటకుండా ఘోర పరాజయంతో ఇంటిదారి పట్టింది.

 జుంపాల జుట్టు ధోనీకి బాగుండదు..

జుంపాల జుట్టు ధోనీకి బాగుండదు..

కెరీర్ ప్రారంభంలో జుంపాల జుట్టుతో ఉన్నధోనీ హెయిర్ స్టైల్ అప్పట్లో ఓ సెన్సేషన్. అప్పటి పాకిస్థాన్ ప్రధాని పెర్వెజ్ ముషారఫ్ సైతం ధోనీ హెయిర్‌స్టైల్‌కు ముగ్దుడయ్యాడు. అభిమానులు కూడా చాలా మంది మహీ స్టైల్‌ను అనుకరించారు. అయితే ఆ హెయిర్‌స్టైల్ తనకు నచ్చదని ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఇటీవల తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ.. జుంపాల జుట్టు జాన్ అబ్రహమ్‌కు బాగుంటుంది కానీ ధోనీకి సూట్ అవ్వదని స్పష్టం చేసింది. ‘అదృష్టవశాత్తు.. జుంపాల జుట్టులో ధోనీని నేను చూడలేదు. అలా చూసుంటే మరోసారి అతనివైపు కన్నెత్తి కూడా చూడకపోయేదాన్ని. అది జాన్‌కు మాత్రమే సెట్ అవుతోంది.'అని సాక్షి చెప్పుకొచ్చింది.

ఈ క్రూరమైన పనులేంటి..? ఏనుగు మరణం కలిచివేస్తోంది: కోహ్లీ, రోహిత్

Story first published: Friday, June 5, 2020, 14:37 [IST]
Other articles published on Jun 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X