4రోజుల టెస్టుకి ఐసీసీ గ్రీన్‌సిగ్నల్: టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే లీగ్‌కు కూడా

Posted By:

హైదరాబాద్: గతేడాది కాలంగా ఎదురుచూస్తున్న టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే ఇంటర్నేషనల్ లీగ్‌ల నిర్వహణకు ఐసీసీ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ క్రికెట్ దిశ, దశను మార్చే పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ గవర్నింగ్ బాడీ సమావేశం తర్వాత సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ ఈ విషయాలను వెల్లడించారు.

టెస్టు సిరిస్‌లో భాగంగా టెస్టు హోదా కలిగిన 12 దేశాల్లో 9 దేశాలు రెండేళ్ల కాల వ్యవధిలో మొత్తం ఆరు సిరిస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో మూడు సొంతగడ్డపై కాగా, మరో మూడు బయట జరుగుతాయి. ఇక వన్డే లీగ్‌ను ఐసీసీ వరల్డ్‌కప్‌కు క్వాలిఫై టోర్నీగా ఐసీసీ నిర్ణయించింది. ఇందులో మొత్తం 12 సభ్యదేశాలతోపాటు ప్రస్తుత ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్ విజేత తలపడతాయి.

 2019, 2020 నుంచి ఈ టెస్టు, వన్డే లీగ్స్ ప్రారంభం

2019, 2020 నుంచి ఈ టెస్టు, వన్డే లీగ్స్ ప్రారంభం

2019, 2020 నుంచి ఈ టెస్టు, వన్డే లీగ్స్ ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని ఐసీసీ మరికొన్ని రోజుల్లో ఆధికారికంగా ప్రకటిస్తుంది. ఇక నాలుగు రోజుల టెస్ట్ క్రికెట్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సభ్య దేశాలకు ఐసీసీ అనుమతినిచ్చింది. ఆయా క్రికెట్ బోర్డులు పరస్పర అంగీకారంతో ఈ నాలుగు రోజుల టెస్ట్‌లను నిర్వహించుకోవచ్చని తెలిపింది.

 డేనైట్ టెస్ట్‌లను ఎలా నిర్వహిస్తున్నారో అలాగే

డేనైట్ టెస్ట్‌లను ఎలా నిర్వహిస్తున్నారో అలాగే

ఇందుకు సంబంధించిన నిబంధలను ఖరారు చేసే పనిలో ఐసీసీ ఉంది. డేనైట్ టెస్ట్‌లను ఎలా నిర్వహిస్తున్నారో అలాగే వీటిని కూడా ఆయా బోర్డులు నిర్వహించుకోవచ్చని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివర్లో బాక్సింగ్ డే టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా-జింబాబ్వే దేశాల మధ్య ఈ తరహా టెస్టు మ్యాచే జరగనుంది. ఇక 2019 వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ వచ్చే ఏడాది మార్చిలో జింబాబ్వేలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

 9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్‌లు

9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్‌లు

'టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్‌లు ఆడతాయి. మూడు ఇంట, మూడు బయట. ఈ సిరీస్‌లు కనీసం రెండు నుంచి గరిష్ఠంగా ఐదు టెస్ట్‌ల వరకు ఉంటాయి. చివరగా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుంది. ఇక వన్డే లీగ్‌లో 13 జట్లు పాల్గొంటాయి' అని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ తెలిపారు. తొలి ఎడిషన్‌లో భాగంగా ప్రతి జట్టు నాలుగు సొంతగడ్డపై, నాలుగు విదేశీ సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది.

 ప్రతి సిరీస్‌లో మూడు వన్డేలు

ప్రతి సిరీస్‌లో మూడు వన్డేలు

ప్రతి సిరీస్‌లో మూడు వన్డేలు ఉంటాయి. ఈ టెస్టు, వన్డే లీగ్స్ ఒప్పందం కుదుర్చుకున్న అన్ని సభ్య దేశాలకు ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రాధాన్యత పెరగడానికి ఇదే అత్యుత్తమ పరిష్కారం అని ఆయన అన్నారు. రెండేళ్ల పాటు దీనిపై చర్చలు నడిచినట్లు ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు.

Story first published: Friday, October 13, 2017, 12:27 [IST]
Other articles published on Oct 13, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి