న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1000వ టెస్టు: ఇంగ్లాండ్‌కు ఐసీసీ కంగ్రాట్స్, మొత్తం గణాంకాలివే

By Nageshwara Rao
ICC pats England for becoming the first nation to play 1000 Tests

హైదరాబాద్: బుధవారం 1000వ టెస్టు ఆడనున్న ఇంగ్లాండ్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందుగానే శుభాకాంక్షలు తెలిపింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన ఆగస్టు 1న తొలి టెస్టులో తలడనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టు ఇంగ్లాండ్ జట్టుకు 1000వ టెస్ట్‌ కావడం విశేషం.

దీంతో 1000 టెస్టుల ఆడిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించనుంది. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహార్ "క్రికెట్ ఫ్యామిలీ తరుపున, 1000వ టెస్టు మ్యాచ్ ఆడబోతోన్న ఇంగ్లాండ్‌కు అభినందనలు. ఈ ఘనత సాధించిన తొలి దేశం ఇంగ్లాండ్. చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఆల్ ద బెస్ట్. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది" అని అన్నారు.

ఇంగ్లాండ్ జట్టుకు తొలి కెప్టెన్‌గా జేమ్స్‌ లిల్లీవైట్‌

ఈ టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ప్యానెల్‌లో సభ్యుడు, మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ జెఫ్ క్రౌన్‌కు ఐసీసీ తరుపున ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కోలిన్ గ్రేవ్స్ వెండి ఫలకాన్ని బహుకరించనున్నారు. ఇంగ్లాండ్‌ జట్టు 1877లో తన తొలి టెస్టును ఆస్ట్రేలియాతో ఆడింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ టెస్టులో జేమ్స్‌ లిల్లీవైట్‌ సారథ్యం వహించాడు.

ఇప్పటివరకు 999 టెస్టులాడిన ఇంగ్లాండ్

మొత్తం 999 టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు 357 మ్యాచ్‌లలో విజయం సాధించగా... 297 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 345 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇప్పటి వరకు 999 టెస్టులాడిన ఇంగ్లాండ్ అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లాడిన జాబితాలో అగ్రస్థానంలో ఉంది. కాగా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జూన్, 1932లో జరిగింది.

ఎడ్జిబాస్టన్‌లో 50 టెస్టులు

ఎడ్జిబాస్టన్‌లో 50 టెస్టులు

ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 117 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా... ఇంగ్లాండ్ 43 టెస్టుల్లో విజయం సాధించగా, 25 టెస్టుల్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న ఎడ్జిబాస్టన్‌లో ఇప్పటివరకు 50 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. 1902లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ తొలి టెస్టు మ్యాచ్ జరిగింది.

ఎడ్జిబాస్టన్‌లో ఇంగ్లాండ్ మెరుగైన రికార్డు

ఎడ్జిబాస్టన్‌లో ఇంగ్లాండ్ మెరుగైన రికార్డు

ఈ స్టేడియంలో ఇంగ్లాండ్ 27 టెస్టుల్లో విజయం సాధించగా, 8 టెస్టుల్లో ఓటమి, 15 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జిబాస్టన్ వేదికగా మొత్తం 6 టెస్టు జరిగాయి. భారత్‌పై 5-0తో ఇంగ్లాండ్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది.

Story first published: Monday, July 30, 2018, 16:22 [IST]
Other articles published on Jul 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X