న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NO.1 ర్యాంకు కోల్పోయిన టీమిండియా: 2013 తర్వాత ఇంగ్లాండ్ తొలిసారి

By Nageshwara Rao
ICC ODI Rankings: England dethrone India as top-ranked side in 50-over format after annual update

హైదరాబాద్: మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియాకు వన్డేల్లో మాత్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో టీమిండియా రెండోస్థానానికి పడిపోయింది. ఇక, టీ20ల్లో మూడోస్థానంలో నిలిచింది.

వన్డే ర్యాంకుల్లో కోహ్లీ సేనను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2013 జనవరి తర్వాత ఇంగ్లాండ్ జట్టు వన్డేల్లో నంబర్ వన్‌గా నిలవడం ఇదే తొలిసారి. 2014-15 గెలుపోటములను పక్కన పెట్టి 2015-16, 2016-17 సీజన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను వెల్లడించింది.

ఈ ర్యాంకింగ్స్ కోసం 2014-15 సీజన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. 2014-15 సీజన్‌‌లో 25 వన్డేలాడిన ఇంగ్లాండ్ 7 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్‌ జట్టుకు 8 పాయింట్లు కలవగా, భారత్‌ తన ఖాతాలోంచి ఒక పాయింట్‌ కోల్పోయింది.

యాన్యువల్ అప్‌డేట్‌లో భాగంగా ఇంగ్లాండ్ 125 పాయింట్లు సంపాదించగా.. భారత్ 122 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా(113) మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ (112), ఆస్ట్రేలియా (104), పాకిస్థాన్‌(102) జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Here are the latest standings:
1. England: 125 points (+8 points)
2. India: 122 (-1)
3. South Africa: 113 (-4)
4. New Zealand: 112 (-2)
5. Australia: 104 (-8)
6. Pakistan: 102 (+6)
7. Bangladesh: 93 (+3)
8. Sri Lanka: 77 (-7)
9. Windies: 69 (-5)
10. Afghanistan: 63 (+5)

ఈ జాబితాలో విండీస్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. అప్ఘానిస్థాన్ పదో స్థానంలో కొనసాగుతోంది. ఇక, టీ20 ర్యాంకుల్లో మాత్రం తొలి ఏడు స్థానాల్లో ఎలాంటి మార్పుల్లేవు. పాకిస్థాన్‌ 130 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా (126), భారత్‌ (123), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లాండ్‌ (115), దక్షిణాఫ్రికా(114), వెస్టిండీస్‌(114) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Wednesday, May 2, 2018, 14:43 [IST]
Other articles published on May 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X