న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జింబాబ్వేపై నిషేధం ఎత్తివేత.. మహిళల టోర్నీల ప్రైజ్‌మనీ పెంపు!!

ICC lifts suspensions on Zimbabwe and Nepal, Two teams have been readmitted as ICC Members


దుబాయ్:
జింబాబ్వే, నేపాల్ క్రికెట్ బోర్డులపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎత్తివేసింది. సోమవారం జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జింబాబ్వే, నేపాల్ దేశాలను తమ సభ్యులుగా గుర్తిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. బోర్డు మీటింగ్‌లో జింబాబ్వే బోర్డు అధికారులు, క్రీడా మంత్రులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటున్నదన్న కారణంతో జింబాబ్వేపై ఐసీసీ ఈ ఏడాది జులైలో నిషేధం విధించిన విషయం తెలిసిందే.

బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ ఏకగ్రీవం.. 23న బాధ్యతల స్వీకరణ!!బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ ఏకగ్రీవం.. 23న బాధ్యతల స్వీకరణ!!

నిబంధనలకు విరుద్ధంగా బోర్డు ఎన్నికల్లో నేపాల్‌ ప్రభుత్వం కలుగజేసుకుందని ఆ దేశ బోర్డును 2016లోనే ఐసీసీ బ్యాన్ చేసింది. తాజాగా ఇరు దేశాలపై నిషేధం ఎత్తివేయడంతో ఆ దేశ ఆటగాలు హర్షం వ్యక్తం చేశారు. నిషేధం అనంతరం జింబాబ్వే ట్రై సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్‌కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌లో జింబాబ్వే పాల్గొననుంది. మరోవైపు నేపాల్‌ కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొననుంది.

బోర్డు మీటింగ్‌లో ఐసీసీ మహిళల క్రికెట్ టోర్నీల ప్రైజ్‌మనీని భారీగా పెంచుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2018తో పోలిస్తే 2020 టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీని ఐదు రెట్లు పెంచింది. టీ20 ప్రపంచకప్ విజేతకు దాదాపు రూ. 7.12కోట్లు ఇవ్వనుంది. ఇక రన్నరప్‌కు దాదాపు రూ.3.56కోట్లు దక్కనుంది. 2021 వన్డే ప్రపంచకప్ కోసం మొత్తం 24 కోట్లను కేటాయించనుంది. తొలిసారిగా అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను 2021 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రపంచకప్‌ సెమీస్‌, పైనల్లో సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్‌ ఓవర్‌లు ఆడిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ సూపర్‌ ఓవర్‌ కూడా టైగా మారడంతో.. బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో ఇక నుంచి సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సూపర్‌ ఓవర్‌ టై అయితే ఫలితం తేలేవరకు సూపర్‌ ఓవర్లు ఉంటాయి. కేవలం నాకౌట్‌ దశలోనే ఆడించే సూపర్‌ ఓవర్‌లను ఇకపై లీగ్‌ దశలోనూ ఆడిస్తారు. అయితే ఆ సూపర్‌ ఓవర్‌ టై అయితే మ్యాచ్‌ను టైగా పరిగణిస్తారు.

Story first published: Tuesday, October 15, 2019, 10:23 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X