న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ ట్యాంపరింగ్‌లో పెనుమార్పులకు తెరలేపిన ఐసీసీ

ICC increases ban for players found guilty of ball-tampering

హైదరాబాద్: ఐసీసీ బాల్ టాంపరింగ్ విషయంలో మరింత తీవ్రతరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదం తరువాత కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ మార్పులు చేసింది. ఏ క్రీడకు సంబంధించిన ఆటగాళ్లు అయిన మైదానంలో హుందాగా ప్రవర్తించాలి. అయితే ఈ మధ్య క్రికెట్‌లో ఆటగాళ్లు హద్దులు మీరుతూ ఆట పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు.

దీంతో ఐసీసీ నిబంధనలను మారుస్తూ కాస్త కఠిన శిక్షలు చేసింది. బాల్ టాంపరింగ్ వివాదమప్పుడే నిబంధనలను మార్చాలని ఐసీసీ భావించింది. కానీ వాటికి ఇప్పుడు ఆమోదం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్న క్రికెట్ లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఐసీసీ స్పష్టం చేసింది.

మోసం చేయడం, దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, బాల్ ఆకారాన్ని మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉండనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం.. బాల్ టాంపరింగ్‌ను లెవల్-3 నేరంగా పరిగణించకుండా.. గరిష్టంగా 12 సస్పెన్షన్ పాయింట్లు విధిస్తారు.

ఈ పాయింట్లు దాటితే సదరు ఆటగాడిపై 6 టెస్టులు లేదా 12 వన్డేలు నిషేధం విధించడంతో పాటు.. సంబంధిత బోర్డుకు కూడా బాధ్యులను చేసి జరిమానా విధించనున్నామని ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఐసీసీ సీఈవో ఇటీవల ఓ సంచలనమైన నిర్ణయానికి తెరలేపారు. ఈ సారి జరగనున్న వరల్డ్ కప్ అనంతరం ఆయన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.

Story first published: Wednesday, July 4, 2018, 20:12 [IST]
Other articles published on Jul 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X