న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

12 టోర్నీల్లో 10 హ్యాట్రిక్‌లు: భారత్ నుంచి ఇద్దరు హ్యాట్రిక్ హీరోలు!

ICC ODI World Cup Recap : The Hat-Trick Heroes || Oneindia Telugu
ICC Cricket World Cup hat-tricks heroes

హైదరాబాద్: ప్రతి నాలుగేళ్లకొకసారి వచ్చే ప్రపంచకప్‌ అంటే ఎంతో ప్రత్యేకం. ఈ మెగా టోర్నీలో నమోదయ్యే ప్రతి రికార్డుకి ఓ గుర్తింపు ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో అటు బ్యాట్స్‌మెన్‌తో పాటు ఇటు బౌలర్లు సైతం చక్కటి ప్రదర్శన చేస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బౌలర్లు ఏమో హ్యాట్రిక్‌లు సాధించడానికి ఉవ్విళ్లూరుతుంటే... బ్యాట్స్‌మెన్ మాత్రం పరుగుల వరద పారించేందుకు సిద్ధమయ్యారు. అయితే, రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో 28వ మ్యాచ్‌లో కాని హ్యాట్రిక్ నమోదు కాలేదు. ఈ ఘనతను ఓ భారత బౌలర్ సాధించడం విశేషం.

సౌతాంప్టన్ వేదికగా అఫ్ఘనిస్థాన్‌తో ముగిసిన మ్యాచ్ ఆఖరి ఓవర్లో షమీ ఈ ఘనత సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో ఇలాంటి అరుదైన ఘనత సాధించిన రెండో భారతీయ బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. మహ్మద్‌ నబీ, అఫ్తాబ్‌ ఆలం, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌లను వరుసగా ఔట్‌ చేయడం ద్వారా షమీ సాధించాడు.

1975 ఆరంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో 28వ మ్యాచ్ వరకు మొత్తం 12 టోర్నీల్లో కేవలం 10 హ్యాట్రిక్‌లు మాత్రమే నమోదయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...

1987 ప్రపంచకప్‌లో చేతన్ శర్మ

1987 ప్రపంచకప్‌లో చేతన్ శర్మ

1975లో ప్రపంచకప్ ప్రారంభమైనా... తొలి హ్యాట్రిక్ మాత్రం 1987లో భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌లో నమోదైంది. ఈ ప్రపంచకప్‌లో భారత బౌలర్‌ చేతన్‌ శర్మ తొలి హ్యాట్రిక్‌ సాధించాడు. నాగపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతన్ శర్మ... న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ కెన్‌ రూథర్‌ఫర్డ్‌, ఇయాన్‌ స్మిత్‌, ఎవిన్‌ చాట్‌ఫీల్డ్‌లను ఔట్‌ చేయడం ద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

1999 ప్రపంచకప్‌లో సక్లెయిన్‌ ముస్తాక్‌

1999 ప్రపంచకప్‌లో సక్లెయిన్‌ ముస్తాక్‌

రెండో హ్యాట్రిక్ కోసం 1999 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. 1999 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బౌలర్‌ సక్లెయిన్‌ ముస్తక్‌ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ హ్యాట్రిక్ సాధించాడు.

2003లో రెండు హ్యాట్రిక్‌లు

2003లో రెండు హ్యాట్రిక్‌లు

సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్‌లో ఏకంగా రెండు హ్యాట్రిక్ లు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌పై శ్రీలంక పేసర్ చమిందా వాస్ హ్యాట్రిక్ సాధించగా.... కెన్యాపై జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ హ్యాట్రిక్ లు నమోదు చేశారు.

2007 ప్రపంచకప్‌లో మలింగ మ్యాజిక్

2007 ప్రపంచకప్‌లో మలింగ మ్యాజిక్

2007 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగ మ్యాజిక్ చేశాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు షాన్‌ పొలాక్‌, ఆండ్రూ హాల్‌, జాక్వస్‌ కలిస్‌, మక్యా నిటిలను ఒకరి తర్వాత ఒకరిని ఔట్‌ చేశాడు.

2011 ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్‌లు

2011 ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్‌లు

2011లో వెస్టిండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌ ఈ ఘనత సాధించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు తీశాడు. మరోవైపు లసిత్ మలింగ కూడా మరోసారి హ్యాట్రిక్ సాధించాడు.

2015 ప్రపంచకప్‌లో కూడా రెండు హ్యాట్రిక్‌లు

2015 ప్రపంచకప్‌లో కూడా రెండు హ్యాట్రిక్‌లు

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ ప్రపంచకప్‌లోనూ ఇద్దరు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ వికెట్లు తీశారు. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ ఫిన్, శ్రీలంకపై సౌతాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ జెపీ డుమిని హ్యాట్రిక్‌లు సాధించారు. ఆసీస్ ఆటగాళ్లు బ్రాడ్ హాడిన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ జాన్సన్‌లను ఫిన్‌ ఔట్‌ చేయగా, శ్రీలంక ఆటగాళ్లు మాథ్యూస్‌, కులశేఖర, తరందు కౌశల్‌ డుమిని ఔట్ చేశాడు.

2019 ప్రపంచకప్‌లో ఒక హ్యాట్రిక్

2019 ప్రపంచకప్‌లో ఒక హ్యాట్రిక్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇంకా సెమీ ఫైనల్‌, ఫైనల్‌తో కలిపి దాదాపు 15కు పైగా మ్యాచ్‌లు ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో ఇంకా ఎవరైనా ఈ ఘనత సాధిస్తారేమో చూడాలి మరి.

Story first published: Tuesday, June 25, 2019, 13:40 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X