న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. ఈ మ్యాచ్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను

ICC Cricket World Cup 2019: Sarfraz Ahmed On Match Loss Against West Indies!! | Oneindia Telugu
ICC Cricket World Cup 2019, West Indies vs Pakistan: Didnt do well as a batting unit today says Pakistan captain Sarfaraz Ahmed

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. విండీస్ బౌలర్లు ఒషేన్‌ థామస్‌, రసెల్‌, హోల్డర్‌ల పదునైన పేస్‌కు పాక్ తలొంచక తప్పలేదు.

అదే మ్యాచ్‌పై ప్రభావం చూపింది:

అదే మ్యాచ్‌పై ప్రభావం చూపింది:

మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్‌ అహ్మద్ మాట్లాడుతూ... 'టాస్ ఓడిపోవడం, త్వరగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి రేసులోకి రావడం చాలా కష్టం. మా బ్యాట్స్‌మన్‌ ఎవ్వరూ బాగా ఆడలేదు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో విఫలమయ్యాం. ఈ రోజు కలిసిరాలేదు. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి ఒత్తిడి పెంచే ఇలాంటి వాటిని మేం పునరావృతం చేయాలనుకోవడం లేదు. ఎన్నో అంచనాలతో మైదానంలోకి దిగినప్పటికీ.. మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం' అని సర్ఫరాజ్‌ అన్నాడు.

అమిర్‌ మా బలం:

అమిర్‌ మా బలం:

'బ్యాట్స్‌మన్‌ విఫలమయినా.. బౌలర్లు మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అమిర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడు మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆనందించదగిన విషయం. వచ్చే మ్యాచ్‌లలో అమిర్‌ మా బలం కానున్నాడు. కచ్చితంగా మేము పుంజుకుంటాం' అని సర్ఫరాజ్‌ ధీమా వ్యక్తం చేసాడు.

105 పరుగులకే ఆలౌట్:

105 పరుగులకే ఆలౌట్:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఫఖర్‌ జమాన్‌ (22) టాప్‌ స్కోరర్. ఒషాన్‌ థామస్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం విండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లకు 108 పరుగులు చేసి విజయాన్నందుకుంది. క్రిస్‌ గేల్‌ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆమిర్‌కు 3 వికెట్లు దక్కాయి.

Story first published: Saturday, June 1, 2019, 13:13 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X