న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్ఘాన్‌పై విండీస్‌ విజయం.. ఆఖరి ప్రపంచకప్ ఆడిన గేల్

ICC Cricket World Cup 2019, West Indies Beat Afghanistan By 23 Runs

మెగా టోర్నీ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన వెస్టిండీస్.. ఆ తర్వాత మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడి ఆఖరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. గురువారం జరిగిన నామమాత్రమైన పోరులో 23 పరుగుల తేడాతో ఆఫ్ఘన్‌పై విండీస్ నెగ్గి విజయంతో టోర్నీ నుండి నిష్క్రమించింది. ఆఖరి ప్రపంచకప్‌ ఆడిన డాషింగ్‌ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు వెస్టిండీస్‌ మంచి విజయంతో వీడ్కోలు పలికింది. మరోవైపు అఫ్ఘాన్‌ తొమ్మిది మ్యాచ్‌లను ఓటమితోనే ముగించి పట్టికలో అట్టడుగున నిలిచింది.

పోరాడిన ఇక్రమ్‌:

పోరాడిన ఇక్రమ్‌:

312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ నయీబ్‌ (5) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో అఫ్గాన్‌ను రహ్మత్‌ షా, ఇక్రమ్‌ జోడీ నిలబెట్టింది. ఇక్రమ్‌ అలిఖిల్‌ (86; 93 బంతుల్లో 8×4), రెహ్మత్‌ షా (62; 78 బంతుల్లో 10×4) రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించి అఫ్గాన్‌కు గట్టి పునాది వేశారు. దీంతో ఈ జోడి ప్రత్యర్థి శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఇద్దరు విండీస్‌ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొని పరుగులు సాధించారు.

అస్ఘర్‌ ఒంటరి పోరాటం:

అస్ఘర్‌ ఒంటరి పోరాటం:

రెహ్మత్‌ షా ఔటయ్యాక నజిబుల్లా (31)తో కలిసి ఇక్రమ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఓ దశలో అఫ్గాన్‌ 35.2 ఓవర్లలో 189/2తో విండీస్‌ను భయపెట్టింది. కానీ.. నిలదొక్కుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఐదు పరుగుల తేడాలో ఔట్‌ కావడంతో అఫ్గాన్‌కు కష్టాల్లో పడింది. కాసేపటికే నబీ (2) కూడా ఔట్‌ కావడంతో అఫ్గాన్‌ పరాజయం ఖాయమైంది. అయితే అస్ఘర్‌ (40; 32 బంతుల్లో 4×4, 1×6) ఒంటరి పోరాటం చేసినా.. 45వ ఓవర్‌లో బ్రాత్‌వైట్‌ అవుట్‌ చేసాడు. అనంతరం సయద్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో ఆఖరి బంతిదాకా అఫ్గాన్‌ ఆడింది. చివరి ఓవర్‌లో 34 పరుగులు అవసరం కాగా.. ఆఖరి బంతికి ఆలెన్‌ స్టన్నింగ్స్‌ క్యాచ్‌తో ఆలౌటైంది. అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది.

చివరి మ్యాచ్‌లో విఫలం:

చివరి మ్యాచ్‌లో విఫలం:

అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (7) ఆడిన చివరి ప్రపంచకప్ మ్యాచ్‌లో త్వరగానే పెవిలియన్ చేరాడు. గేల్ ఔటైనా.. మరో ఓపెనర్ లెవీస్‌తో కలిసి హోప్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు అఫ్గాన్‌ బౌలర్లను ఎదుర్కొని రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. స్పిన్నర్లు పరుగులు కట్టడి చేస్తుండటంతో పేసర్లను లక్ష్యంగా చేసుకొని పరుగులు చేశారు. అర్ధ శతకం అనంతరం లెవీస్ (58; 78 బంతుల్లో 6×4, 2×6) ఔటైనా.. హెట్‌మైర్ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి హోప్ మూడో వికెట్‌కు 65 పరుగులు జోడించాడు

మెరిసిన పూరన్:

మెరిసిన పూరన్:

స్వల్ప వ్యవధిలో హెట్‌మైర్, హోప్‌ (77; 92 బంతుల్లో 6×4, 2×6) వెనుదిరిగినా.. యువ ఆటగాడు నికోలస్ పూరన్ (58; 43 బంతుల్లో 6×4, 1×6) ఫామ్ కొనసాగించాడు. అతడికి కెప్టెన్ హోల్డర్ (34 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) కూడా జతవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 71 బంతుల్లోనే 105 పరుగులు జోడించడంతో విండీస్ స్కోరు 300 దాటింది. ఆఖరి ఓవర్‌ తొలి రెండు బంతుల్లో పూరన్‌, హోల్డర్‌ వెనుదిరిగారు. ఆఫ్ఘన్ బౌలర్లలో దౌలత్ జద్రాన్‌కు 2 వికెట్లు దక్కాయి.

1
43685
Story first published: Friday, July 5, 2019, 9:59 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X