న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచకప్‌లో వారే ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌లు'

ICC Cricket World Cup 2019: Virat Kohli is the form batsman going into the World Cup: Jos Buttler

ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌లు అని ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ పేర్కొన్నారు. ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జోస్‌ బట్లర్‌ కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

'కోహ్లీ, స్మిత్‌లు ఇద్దరూ మంచి బ్యాట్స్‌మెన్‌లు. ఐపీఎల్-12లో స్మిత్‌ను దగ్గర నుండి చూసాను. అతన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనో అద్భుతమైన బ్యాట్స్‌మన్‌. 12 నెలల పాటు అతను ఫామ్‌లోనే ఉంటాడు. ఇద్దరి బ్యాటింగ్‌ స్టైల్ వేర్వేరుగా ఉంటుంది. వారి ఆటంటే నాకు ఇష్టం. ఈసారి ప్రపంచకప్‌లో వారే ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌లు' అని బట్లర్‌ పేర్కొన్నారు.

'బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్‌ను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ.. జట్టు సబ్యులకు ఆదర్శంగా నిలిచాడు. ప్రపంచంలోనే బెన్ మంచి ఆల్‌రౌండర్‌. అతడు కచ్చితంగా ప్రపంచకప్‌లో సత్తా చాటుతాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున నా ఆటతీరు బాగుంది. ఐపీఎల్‌ ఫామ్‌ ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుంది. ఈసారి ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. ప్రపంచకప్‌ జట్టులో ఉండడం సంతోషంగా ఉంది' అని బట్లర్‌ తెలిపారు.

ఈ నెల 30న జరిగే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది. అంతకంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో విశ్వవిజేతగా నిలవాలని ఇంగ్లండ్‌ పట్టుదలతో ఉంది.

Story first published: Wednesday, May 22, 2019, 16:39 [IST]
Other articles published on May 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X