3డీ కళ్లద్దాలు ఆర్డర్‌ చేశా: రాయుడు ట్వీట్‌పై స్పందించిన విజయ్‌ శంకర్‌

ICC Cricket World Cup 2019 : Vijay Shankar Responds To Ambati Rayudu's 3D Glasses Tweet || Oneindia

ప్రపంచకప్-2019 జట్టులో తనని ఎంపిక చేయకపోవడంతో కొద్ది రోజుల క్రితం టీమిండియా బ్యాట్స్‌మన్‌, తెలుగు తేజం అంబటి రాయుడు చేసిన 'త్రీడీ' ట్వీట్ చర్చనీయాంశమైంది. 'వరల్డ్‌ కప్ చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లద్దాలకి ఆర్డరిచ్చాను' అని ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్‌పై ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ స్పందించాడు. ఆ ట్వీట్‌ తనని ఉద్ధశించి చేసింది కాదని, ఒక క్రికెటర్‌గా నేను అతడిని ఆవేదనను అర్థం చేసుకున్నానని శంకర్‌ చెప్పుకొచ్చాడు.

రాయుడు బాధను అర్థం చేసుకోగలను:

రాయుడు బాధను అర్థం చేసుకోగలను:

తాజాగా శంకర్‌ మాట్లాడుతూ... 'ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక చెయ్యకపోతే ఎలా ఉంటుందో ఒక క్రికెటర్‌గా నాకు తెలుసు. రాయుడు బాధను నేను అర్థం చేసుకోగలను. అతను చేసిన ట్వీట్‌ నన్ను ఉద్ధశించి చేసింది కాదు. ఆ ట్వీట్‌తో తన అసహనం తెలియజేశాడు. ఏ క్రికెటర్‌కైనా ఇది సహజమే' అని శంకర్ అన్నారు.

తొలి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా:

తొలి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా:

'జట్టుకు అవసరమైనప్పుడల్లా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రపంచకప్‌లో ఆడటం మంచి అవకాశం. తొలి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను ఒక్క మ్యాచ్‌ గెలిపించినా చాలా సంతోషపడతా. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తే ఆట మీద శ్రద్ధ చూపలేమేం. దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గర్వంగా ఉంది' అని శంకర్ తెలిపారు.

నేను కూడా అలవాటు చేసుకున్నా:

నేను కూడా అలవాటు చేసుకున్నా:

'ఎంఎస్ ధోనీ మైదానంలో చాలా కామ్ గా ఉంటాడు. ఇది నేను కూడా అలవాటు చేసుకున్నా. ఆటపై దృష్టి పెట్టు, అదే నిన్ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని మహీ భాయ్ చెప్పాడు. మెల్బోర్న్ మైదానంలో నా మొదటి మ్యాచ్. అంత పెద్ద మైదానాన్ని గతంలో ఎప్పుడు చూడకపోవడంతో కొద్దిగా ఆందోళనకు గురయ్యా. ఆ సమయంలో మహీ భాయ్ వచ్చి.. బంతిని చూసి సరైన షాట్ ఆడు అని చెప్పాడు. ఇలా అతని నుంచి ఎన్నో నేర్చుకున్నా' అని శంకర్ చెప్పుకొచ్చారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 26, 2019, 15:30 [IST]
Other articles published on May 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X