న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే 11 స్టేడియాలివే: వాటి కెపాసిటీ, జరిగే మ్యాచ్‌లు

ICC Cricket World Cup 2019 Match Venues And Stadiums List ! || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Venues, Records & Match details

హైదరాబాద్: 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తం 10 దేశాలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్ మే30న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం ఆతథ్యమిస్తోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. ఈ వన్డే వరల్డ్‌కప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఇదే ఆరోసారి కావడం విశేషం. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ వన్డే వరల్డ్‌కప్ మెగా టోర్నీకి మొత్తం 11 వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తోన్న 11 వేదికల పూర్తి సమాచారం మీకోసం ప్రత్యేకం....

కెన్నింగ్టన్ ఓవల్ - లండన్

కెన్నింగ్టన్ ఓవల్ - లండన్

కెన్నింగ్టన్ ఓవల్‌ను ద ఓవల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన మైదానాల్లో ఇదొకటి. 1845లో ఈ స్టేడియం ప్రారంభమైంది. స్టేడియం కెపాసిటీ 25,500. ఇంగ్లాండ్ జట్టు తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ని ఈ మైదానంలో ఆడింది. యాషెస్ అనే పేరు కూడా ఈ మైదానంలోనే వచ్చింది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

May 30, Thu

England vs South Africa, Match 1

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 02, Sun

South Africa vs Bangladesh, Match 5

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 05, Wed

Bangladesh vs New Zealand, Match 9

6:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 09, Sun

India vs Australia, Match 14

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 15, Sat

Sri Lanka vs Australia, Match 20

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

ట్రెంట్ బ్రిడ్జి - నాటింగ్‌హామ్

ట్రెంట్ బ్రిడ్జి - నాటింగ్‌హామ్

1841లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఉన్న ఈ ట్రెంట్ బ్రిడ్జి స్టేడియం కూడా ఓ ఐకానిక్ వేదిక. ఈ స్టేడియం కెపాసిటీ 17,500. క్రికెట్‌ను వీక్షించేందుకు ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ స్టేడియాల్లో ఇదొకటి. 19వ శతాబ్దంలో ఈ స్డేడియం పుట్‌బాల్ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది.

ఈ స్టేడియంలో జరిగే మ్యా్చ్‌లు:

May 31, Fri

Windies vs Pakistan, Match 2

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 03, Mon

England vs Pakistan, Match 6

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 06, Thu

Australia vs Windies, Match 10

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 13, Thu

India vs New Zealand, Match 18

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 20, Thu

Australia vs Bangladesh, Match 26

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

సోఫియా గార్డెన్స్ - కార్డిఫ్

సోఫియా గార్డెన్స్ - కార్డిఫ్

సోఫియా గార్డెన్స్ స్టేడియంలో కార్ఢిఫ్‌లోని వేల్స్ నగరంలో ఉంది. ఈ స్టేడియాన్ని కొంత మంది కార్ఢిప్ వేల్స్ స్టేడియం అని కూడా పిలుస్తారు. ఈ స్టేడియంలో తక్కువ దూరంలో స్ట్రయిట్ బౌండరీలతో పాటు దూర స్క్వేర్ బౌండరీలు ఉన్నాయి.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 01, Sat

New Zealand vs Sri Lanka, Match 3

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 04, Tue

Afghanistan vs Sri Lanka, Match 7

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 08, Sat

England vs Bangladesh, Match 12

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 15, Sat

South Africa vs Afghanistan, Match 21

6:00 PM (12:30 PM GMT / 01:30 PM LOCAL)

కంట్రీ గ్రౌండ్ - బ్రిస్టల్

కంట్రీ గ్రౌండ్ - బ్రిస్టల్

బ్రిస్టల్‌లోని కంట్రీ గ్రౌండ్ గ్లోసిస్టర్‌షైర్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. అయితే, ఇంగ్లాండ్‌లో అంత ఫేమస్ గ్రౌండ్ అయితే ఇది కాదు. ఈ స్టేడియం యొక్క నిర్మాణం విభిన్నంగా ఉండటంతో అప్పుడప్పుడు వన్డేలకు ఆతిథ్యమిస్తుంటుంది. కంట్రీ గ్రౌండ్ గుండ్రగా ఉంటుంది. అందుకే ఈ స్టేడియానికి ఐసీసీ కేవలం మూడు మ్యాచ్‌లనే కేటాయించింది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 01, Sat

Afghanistan vs Australia, Match 4

6:00 PM (12:30 PM GMT / 01:30 PM LOCAL)

Jun 07, Fri

Pakistan vs Sri Lanka, Match 11

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 11, Tue

Bangladesh vs Sri Lanka, Match 16

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

ది రోస్ బౌల్ - సౌతాంప్టన్

ది రోస్ బౌల్ - సౌతాంప్టన్

ఈ స్టేడియంలో రోస్ బౌల్ మాదిరి మూడంతస్తుల పెవిలియన్ ఉంటుంది. అంతేకాదు సౌతాంప్టన్ సిటీకి దూరంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో ఉన్న అద్భుతమైన స్టేడియాల్లో సౌతాంప్టన్ స్టేడియం ఒకటి. సూర్యుడు ఉదయించే సమయంలో ఈ స్టేడియంలో మ్యాచ్‌ని వీక్షించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 05, Wed

South Africa vs India, Match 8

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 10, Mon

South Africa vs Windies, Match 15

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 14, Fri

England vs Windies, Match 19

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 22, Sat

India vs Afghanistan, Match 28

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 24, Mon

Bangladesh vs Afghanistan, Match 31

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

ద కూపర్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్ - టౌన్‌టన్

ద కూపర్ అసోసియేట్స్ కంట్రీ గ్రౌండ్ - టౌన్‌టన్

ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు అధికారిక హోం గ్రౌండ్ ఇది. టౌన్ సెంటర్‌కు అతి సమీపంలో ఈ స్టేడియాన్ని నిర్మించారు. టెస్టు మ్యాచ్‌లకు అప్పుడప్పుడు ఆతిథ్యమిచ్చే ఈ గ్రౌండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్‌లకు మాత్రం రెగ్యులర్‌గా ఆతిథ్యమిస్తుంది. ఈ స్టేడియం కెపాసిటీ 12,500. 1882లో ఈస్టేడియాన్ని ఓపెన్ చేసినప్పటికీ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ మాత్రం 1983 క్రికెట్ వరల్డ్‌కప్ సమయంలో జరిగింది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 08, Sat

Afghanistan vs New Zealand, Match 13

6:00 PM (12:30 PM GMT / 01:30 PM LOCAL)

Jun 12, Wed

Australia vs Pakistan, Match 17

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 17, Mon

Windies vs Bangladesh, Match 23

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

ఓల్డ్ ట్రాఫోర్డ్ - మాంచెస్టర్

ఓల్డ్ ట్రాఫోర్డ్ - మాంచెస్టర్

దక్షిణ మాంచెస్టర్ సిటీలో ఈ స్టేడియం ఉంది. ఓల్డ్ ట్రాపోర్డ్‌కి ఘనమైన చరిత్ర ఉంది. 1956లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టెస్టు క్రికెటర్ జిమ్ లేకర్ ఈ స్టేడియంలోనే ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఈ స్టేడియం కెపాసిటీ 19,000.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 16, Sun

India vs Pakistan, Match 22

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 18, Tue

England vs Afghanistan, Match 24

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 22, Sat

Windies vs New Zealand, Match 29

6:00 PM (12:30 PM GMT / 01:30 PM LOCAL)

Jun 27, Thu

Windies vs India, Match 34

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 06, Sat

Australia vs South Africa, Match 45

6:00 PM (12:30 PM GMT / 01:30 PM LOCAL)

Jul 09, Tue

TBC vs TBC, 1st Semi-Final (1 v 4)

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

ఎడ్జిబాస్టన్ - బర్మింగ్‌హామ్

ఎడ్జిబాస్టన్ - బర్మింగ్‌హామ్

ఇంగ్లాండ్‌లో ఉన్న అద్భుతమైన మైదానాల్లో ఎడ్జిబాస్టన్ స్టేడియం ఒకటి. ఇంగ్లాండ్‌లో ఈ మధ్య కాలంలో నిర్మితమైన స్టేడియాల్లో ఇదొకటి. ఈ క్రికెట్ స్టేడియం నుంచి మ్యాచ్‌ని వీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుంది. 1994లో దుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ స్టేడియంలోనే బ్రియాన్ లారా 501 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ స్టేడియంలోని స్కోరు బోర్డు సైతం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 19, Wed

New Zealand vs South Africa, Match 25

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 26, Wed

New Zealand vs Pakistan, Match 33

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 30, Sun

England vs India, Match 38

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 02, Tue

Bangladesh vs India, Match 40

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 11, Thu

TBC vs TBC, 2nd Semi-Final (2 v 3)

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

హెడింగ్లే - లీడ్స్

హెడింగ్లే - లీడ్స్

హెడింగ్లే ఈ స్టేడియం పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సర్ డ్రాన్ బ్రాడ్ మన్. ఈ స్డేడియంలో సర్ డాన్ బ్రాడ్‌మన్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ఈ స్టేడియంలో బ్రాడ్‌మన్ రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. తొలుత 1930లో సాధించగా... ఆ తర్వాత 1934లో సాధించాడు. టెస్టుల్లో బ్రాడ్‌మన్ నమోదు చేసిన ఆత్యధిక వ్యక్తిగత స్కోరు(334)లో 309 పరుగులను ఒక్కరోజే ఈ స్టేడియంలో సాధించాడు. వీటితో పాటు ఈ స్టేడియంలో అనేక రికార్డులు నమోదుయ్యాయి. ఈ స్టేడియం రెగ్యులర్‌గా టెస్టులు, వన్డేలకు ఆతిథ్యమిస్తుంది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 21, Fri

England vs Sri Lanka, Match 27

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 29, Sat

Pakistan vs Afghanistan, Match 36

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 04, Thu

Afghanistan vs Windies, Match 42

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 06, Sat

Sri Lanka vs India, Match 44

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

లార్డ్స్ - లండన్

లార్డ్స్ - లండన్

క్రికెట్‌కు పుట్టినిల్లు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైదానాల్లో ఇదొకటి. ఈ స్టేడియంలోని పెవిలియన్ కూడా ఓ ల్యాండ్‌మార్క్. క్రికెట్ అభిమానులు ముద్దుగా 'హోం ఆఫ్ క్రికెట్' అని పిలుచుకుంటారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ సెంటర్‌లో ఉంటుంది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 23, Sun

Pakistan vs South Africa, Match 30

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 25, Tue

England vs Australia, Match 32

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jun 29, Sat

New Zealand vs Australia, Match 37

6:00 PM (12:30 PM GMT / 01:30 PM LOCAL)

Jul 05, Fri

Pakistan vs Bangladesh, Match 43

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 14, Sun

TBC vs TBC, Final

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

రివర్సడ్ గ్రౌండ్ - చెస్టర్-లీ-స్ట్రీట్

రివర్సడ్ గ్రౌండ్ - చెస్టర్-లీ-స్ట్రీట్

గత కొన్ని సంవత్సరాలుగా చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని ఈ రివర్సడ్ గ్రౌండ్ అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ స్టేడియంలోని స్టాండ్స్ చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. దీంతో బ్యాట్స్‌మన్ బౌండరీ బాదితే చాలు వెంటనే ప్రేక్షకులు చేతుల్లో ఉంటుంది. 1999లో ఈ స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కూడా పాకిస్థాన్-స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగింది.

ఈ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు

Jun 28, Fri

Sri Lanka vs South Africa, Match 35

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 01, Mon

Sri Lanka vs Windies, Match 39

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Jul 03, Wed

England vs New Zealand, Match 41

3:00 PM (09:30 AM GMT / 10:30 AM LOCAL)

Story first published: Thursday, May 9, 2019, 18:51 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X