న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియా షాక్: టోర్నీ నుంచి ఖవాజా ఔట్.. స్టోయినిస్‌ కూడా డౌటే

ICC Cricket World Cup 2019: Usman Khawaja Ruled Out Of Tournament,With Stoinis A Doubt For Australia
ICC Cricket World Cup 2019: Usman Khawaja out of World Cup, Matthew Wade lined up as replacement and Marcus Stoinis a doubt

కీలక సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా షాన్‌ మార్ష్‌ టోర్నీకి దూరం కాగా.. తాజాగా స్టార్ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా ప్రపంచకప్‌ నుండి వైదొలిగాడు. తొడ కండరాల నొప్పితో సతమవుతున్న ఉస్మాన్‌ ఖవాజా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించినట్లు ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. ఖవాజా స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ మాథ్యూ వేడ్‌ జట్టులోకి రానున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెక్నికల్‌ కమిటీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

ఖవాజా స్థానంలో వేడ్‌:

ఖవాజా స్థానంలో వేడ్‌:

'ఉస్మాన్‌ ఖవాజాకు తొడ కండరాలు పట్టేశాయి. అతను కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరం. దాంతో ఖవాజా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు ఖవాజా దూరమవడం బాధాకరం. జట్టులో అతను ప్రధాన ఆటగాడు. యాషెస్‌ సిరీస్‌ నాటికి అతను అందుబాటులోకి వస్తాడు. ఖవాజా స్థానంలో వేడ్‌ జట్టులోకి రానున్నాడు' అని లాంగర్‌ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా:

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా:

శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఖవాజా తొడ కండరాలు పట్టేశాయి. లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఖవాజా.. తొడ కండరాలు పట్టేయడంతో ఐదు బంతులు ఆడి రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆసీస్‌ ఏడు వికెట్లు కోల్పోయిన అనంతరం ఖవాజా బ్యాటింగ్‌కు వచ్చి తక్కువ పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఖవాజా 14 బంతులు ఆడి 18 పరుగులు చేశాడు.

స్టోయినిస్‌ స్థానంలో మిఛెల్:

స్టోయినిస్‌ స్థానంలో మిఛెల్:

ఆల్‌రౌండ‌ర్‌ మార్క‌స్ స్టోయినిస్‌ సైతం ఇదే గాయంతో ఇబ్బంది ప‌డుతున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్ చేయ‌గ‌ల స్టోయినిస్‌.. ఈ నెల 11వ తేదీన ఇంగ్లండ్‌తో జ‌రిగే రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. స్టోయినిస్‌ స్థానంలో మిఛెల్ మార్ష్‌ను జ‌ట్టులోకి తీసుకోనున్నారు. కీలక సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు ఇద్దరు దూరమవడం ఎదురుదెబ్బే. ఇద్దరూ కూడా మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.

పరుగుల ప్రవాహం:

పరుగుల ప్రవాహం:

ఖవాజా దూరమయినా.. జట్టులోకి వచ్చే మాథ్యూ వేడ్‌ ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా- ఏ జ‌ట్టు త‌ర‌ఫున పరుగుల ప్రవాహం పారిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో ప‌ర్యటిస్తోన్న ఆస్ట్రేలియా-ఎ టీమ్ త‌ర‌ఫున ఆడుతున్న ఈ ఎడ‌మ‌చేతి వాటం బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా సెంచ‌రీలు సాధిస్తున్నాడు. వేడ్‌ ఫాస్టెస్ట్ సెంచ‌రీని నమోదు చేశాడు. 45 బంతుల్లో సెంచరీ చేసాడు. ఇక 68 బంతుల్లో 150 ప‌రుగుల‌ను పూర్తి చేశాడు. 71 బంతుల్లో 155 ర‌న్స్ సాధించాడు. ఆస్ట్రేలియా లిస్ట్‌-ఎ క్రికెట్ విభాగంలో ఇదే అత్యుత్త‌మ సెంచ‌రీ. ఇంత త‌క్క‌వ బంతుల్లో లిస్ట్‌-ఎలో సెంచ‌రీ చేసిన బ్యాట్స్‌మెన్ మ‌రొక‌రు లేరు.

Story first published: Monday, July 8, 2019, 12:00 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X