న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టైటిల్‌ కొట్టే సత్తా ఉంది.. నేనెప్పుడు ఆసీస్‌కు వ్యతిరేకం కాదు

ICC Cricket World Cup 2019: Steve Smith, David Warner will need to have thick skin to counter Englands sledging, says Brett Lee

టైటిల్‌ కొట్టే సత్తా ఆసీస్‌ ఆటగాళ్లకు ఉంది. నేనెప్పుడు ఆసీస్‌కు వ్యతిరేకం కాదు అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌లీ పేర్కొన్నాడు. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, కాస్త తోలు మందం చేసుకోవాలని అన్నాడు. గత సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పపడి స్మిత్‌, వార్నర్‌లు ఏడాది పాటు సస్పెన్షన్ గురైన విషయం తెలిసిందే.

చీటర్స్‌ అంటూ విమర్శలు:

చీటర్స్‌ అంటూ విమర్శలు:

ఈ సంఘటనతో ప్రపంచకప్ రెండు వార్మప్ మ్యాచుల్లో స్మిత్‌, వార్నర్‌కు అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. వార్నర్‌, స్మిత్‌లు చీటర్స్‌ అంటూ అభిమానులు తీవ్ర స్థాయిల్లో కామెంట్‌ చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్‌ చేశారు. ఈ నేపథ్యంలో బ్రెట్‌లీ వారికి మద్దతుగా నిలిచాడు.

నిరూపించుకోవాల్సిందేం లేదు:

నిరూపించుకోవాల్సిందేం లేదు:

బ్రెట్‌లీ మాట్లాడుతూ... 'స్మిత్‌, వార్నర్‌లు నిరూపించుకోవాల్సిందేం లేదు. పునరాగమనం చేసినందుకు వారిద్దరూ సంతోషపడాలి. వార్నర్‌ ఐపీఎల్‌ బాగా ఆడాడు. స్మిత్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోకి వారిద్దరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆసీస్‌ విజయం సాధించడానికి స్మిత్‌, వార్నర్‌కు తగిన అవకాశం కల్పించారు' అని బ్రెట్‌లీ అన్నాడు.

తోలు మందం చేసుకోవాలి:

తోలు మందం చేసుకోవాలి:

'కెవిన్‌ పీటర్సన్‌ వంటి వారి స్లెడ్జింగ్‌ తట్టుకోవడానికి ఈ ఇద్దరు తోలు మందం చేసుకోవాలి. ఇంగ్లీష్ గడ్డపై రాణిస్తారని నమ్మకం ఉంది. ఆస్ట్రేలియా వరుసగా మ్యాచ్‌లు గెలిస్తే ఆరోసారి కూడా టైటిల్‌ గెలుచుకుంటుంది. ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కలిగే అనుభూతి చాలా గొప్పది. టైటిల్‌ కొట్టె సత్తా ఆసీస్‌కు ఉంది. నేనెప్పుడు ఆసీస్‌కు వ్యతిరేకం కాదు' అని బ్రెట్‌లీ పేర్కొన్నాడు.

Story first published: Friday, May 31, 2019, 20:34 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X