న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ ఐదోసారి: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌పై స్పెషల్ స్టోరీ

Special Story On ICC Cricket World Cup 2019 || Oneindia Telugu
ICC Cricket World Cup 2019 Starts from may 30th onwards

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. నిన్నటివరకు టీ20 మజాను ఆస్వాదించిన క్రికెట్ అభిమానులు ఇకపై వన్డే వరల్డ్‌కప్‌ను ఆస్వాదించనున్నారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది.

స్పెషల్ స్టోరీలు: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019

వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. డే మ్యాచ్‌లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక, డే/నైట్ మ్యాచ్‌లు మాత్రం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈసారి రౌండ్ రాబిన్ పద్దతిలో

ఈసారి రౌండ్ రాబిన్ పద్దతిలో

1975 నుంచి 1987 మధ్య జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ల్లో జట్లను గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్‌కప్‌ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్‌కప్‌ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్లు

వరల్డ్‌కప్‌లో పాల్గొనే 10 జట్లు

ఇంగ్లాండ్

ఆస్ట్రేలియా

బంగ్లాదేశ్

ఇండియా

న్యూజిలాండ్

పాకిస్థాన్

దక్షిణాఫ్రికా

శ్రీలంక

ఆప్ఘనిస్థాన్

వెస్టిండిస్

వీక్షణ రికార్డు బద్దలు కొట్టేనా?

వీక్షణ రికార్డు బద్దలు కొట్టేనా?

క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్‌లో అయినా అత్యధికంగా వీక్షించేది మాత్రం భారత్‌లోనే. 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఆడిన సెమీఫైనల్‌ వరకు పరిగణనలోకి తీసుకుంటే ప్రసారకర్త స్టార్‌ స్పోర్ట్స్‌ లెక్కల ప్రకారం 63.50 కోట్ల మంది భారతీయులు టీవీల్లో వీక్షించారు. ఈసారి వంద కోట్ల మార్కును తాకుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్‌కప్‌ను ఎలా వీక్షించొచ్చు అంటే!

ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్‌కప్‌ను ఎలా వీక్షించొచ్చు అంటే!

ఆస్ట్రేలియా: ESPN

ఇండియా: Star Sports 2 and Hotstar.com

బంగ్లాదేశ్: GTV and Rabbitholebd.com

న్యూజిలాండ్: Sky Sport and SkyGo

పాకిస్థాన్: PTV Sports, Ten Sports and SonyLiv

శ్రీలంక: SLRC and Channel Eye

ఆప్ఘనిస్థాన్: Moby and Hotstar

వెస్టిండిస్: ESPN and ESPN+ Caribbean

Story first published: Tuesday, May 14, 2019, 12:47 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X