న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన కివీస్ పేసర్లు: 136 పరుగులకే శ్రీలంక ఆలౌట్

ICC Cricket World Cup 2019: Srilanka are all out for 136


హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక చెత్త ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు 29.2 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌కు 137 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. లంక కెప్టెన్ కరుణరత్నే84 బంతుల్లో 52(4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
1
43646

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మొదటి ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. కివీస్ పేసర్ హెన్రీ బౌలింగ్‌లో తొలి బంతిని ఫోర్ బాదిన తిరుమానె ఆ తర్వాత రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. హెన్రీ వేసిన రెండో బంతి నేరుగా బ్యాట్స్‌మన్ ప్యాడ్‌కి తగిలినప్పటికీ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

రెండో బంతికే తిరుమానె ఔట్

దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెంటనే రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ పరిశీలించారు. ఈ రివ్యూలో బంతి బ్యాట్‌కు తాకకపోగా, నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకుతున్నట్లు కనిపించడంతో తిరుమానెను ఔట్‌గా ప్రకటించారు. దీంతో శ్రీలంక నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది.

చెలరేగిన కివీస్ పేసర్లు

అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరాతో కలిసి కెప్టెన్ కరుణరత్నే ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. పిచ్ బౌలింగ్‌కి పూర్తిస్థాయిలో అనుకూలించడంతో కివీస్ పేసర్లు చెలరేగారు. తొమ్మిదో ఓవర్‌ మొదటి బంతికి కుశాల్‌ పెరీరా(29) ఔట్‌ చేసిన హెన్రీ, ఆ మరుసటి బంతికే కుశాల్‌ మెండిస్‌ను పెవిలియన్‌‌కు పంపాడు.

46 పరుగులకే మూడు వికెట్లు

హెన్రీ దెబ్బకు శ్రీలంక 46 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సెల్వా(4) పరుగుల వద్ద ఫెర్గ్యుసన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక, ఏంజెలో మాథ్యూస్‌ డకౌట్‌ కాగా, జీవన్‌ మెండిస్‌(1) పెవిలియన్‌కు చేరారు. చివర్లో తిషారా పెరీరా(27) రాణించడంతో వంద పరుగుల మార్కుని అందుకుంది.

చెరో మూడు వికెట్లు తీసిన హెన్రీ, లూకీ

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇసురు ఉదనా డౌకట్‌గా పెవిలియన్‌కు చేరగా... సురంగ లక్మల్ (7), లసిత్ మలింగ(1) నిరాశపరిచారు. ఇక, న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, లూకీ ఫెర్గ్యుసన్‌ చెరో మూడు వికెట్లు తీయగా... బౌల్ట్, శాంటర్న్, గ్రాండ్‌హోమ్, జిమ్మీ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Saturday, June 1, 2019, 17:59 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X