న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంకకు భారీ షాక్.. ప్రపంచకప్‌ నుండి నువాన్‌ ప్రదీప్‌ ఔట్‌

ICC Cricket World Cup 2019: Sri Lanka Pacer Nuwan Pradeep out of remainder of World Cup due to Chickenpox

ప్రపంచక్‌పలో శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. లంక సీనియర్ పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుండి వైదొలిగాడు. చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న నువాన్‌ను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు శనివారం స్పష్టం చేసింది. ప్రదీప్‌ స్థానంలో కసున్‌ రజితను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఈవెంట్‌ టెక్నికల్‌ కమిటీకి తెలియజేసినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈనెల 4న అఫ్ఘానిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో ప్రదీప్‌ నాలుగు వికెట్లు తీసి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రధాన పేసర్ లసిత్ మలింగతో కలిసి పేస్ భారం మోసే ప్రదీప్‌ దూరమవడం లంకకు ఎదురుదెబ్బే. శ్రీలంక ప్రపంచకప్ సెమీస్‌ బెర్త్‌ వేటలో ఉన్న విషయం తెలిసిందే. ప్రదీప్ మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడినా.. మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసాడు. అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం విశేషం.

ప్రదీప్ స్థానంలో ఎంపికయిన కుశాన్‌ రజితా ఇప్పటివరకూ ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 35 వికెట్లు తీశాడు. వన్డేలలో ఐదు వికెట్లు తీసాడు. లంక ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాలి. జులై 1న వెస్టిండీస్, జులై 6న టీమిండియాతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో లంక గెలిస్తే.. ఇతర జట్లపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

Story first published: Sunday, June 30, 2019, 12:27 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X