న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా మూడో ఓటమి.. సఫారీలు నిలవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే

ICC Cricket World Cup 2019 : Can South Africa Reach Semis? Tough Times Ahead For Du Plessis & Team
ICC Cricket World Cup 2019: South Africa world cup 2019 semi final chances is alive?

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టోర్నీలలో దక్షిణాఫ్రికాకు రికార్డు ఏమంత బాగాలేదు. జట్టుగా బలంగా ఉన్నా.. ఇంతవరకు ఒక్క కప్ కూడా కొట్టలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును 'చోకర్స్‌' అని కూడా పిలుస్తున్నారు. ప్రతి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. కొన్ని సార్లు జట్టుగా విఫలమయి టోర్నీ నుండి నిష్క్రమించగా.. మరికొన్ని సార్లు వాతావరణం కూడా ప్రతికూలంగా మారడంతో టోర్నీ నుండి తప్పుకోవాల్సి వస్తుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆరంభంలోనే సంక్లిష్టం:

ఆరంభంలోనే సంక్లిష్టం:

అయితే ఈసారి దక్షిణాఫ్రికాపై అంచనాలు కొంచెం తక్కువే ఉన్నాయి. కానీ.. ఆ జట్టు వాటిని కూడా అందుకోలేకపోయింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన సఫారీ జట్టు సెమీస్‌ అవకాశాల్ని టోర్నీ ఆరంభ దశలోనే సంక్లిష్టం చేసుకుంది. బంగ్లా చేతిలో ఓడాక భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం పోటీ ఇచ్చింది. బౌలర్లు విజయవంతం అయినా.. బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు.

రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌లు:

రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచ్‌లు:

1992 ప్రపంచకప్‌ రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహించారు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ప్రపంచకప్‌ 2019ను రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ప్రపంచకప్‌ 2019లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం ప్రతి జట్టు ఇతర జట్లతో 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచుల అనంతరం.. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్లో రెండు జట్లు (1 vs 4, 2 vs 3) ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.

ఆరు మ్యాచ్‌లు గెలిస్తేనే

ఆరు మ్యాచ్‌లు గెలిస్తేనే

రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం.. సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఆరు విజయాలు అవసరం. ఇప్పటికే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ జట్లపై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌ చేరాలంటే చివరి ఆరు మ్యాచ్‌లలో విజయం సాదించాలి. దక్షిణాఫ్రికా తదుపరి మ్యాచ్‌లలో పటిష్ట జట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌లతో తలపడనుంది. వీటిని ఓడించడం అంత సులువు కాదు. ఈ అడ్డంకుల్ని దాటి సఫారీ జట్టు సెమీస్‌ చేరడం కష్టమే. ఆరు మ్యాచ్‌లు గెలిస్తే సెమీస్‌ నేరుగా చేరొచ్చు. ఒకటి, రెండు మ్యాచ్‌లు ఓడితే.. ఐపీఎల్-12 మాదిరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరే అవకాశాలు లేవు.

Story first published: Thursday, June 6, 2019, 12:59 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X