న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్‌కు పరిణతి లేదు.. దక్షిణాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు

ICC Cricket World Cup 2019: South Africa vs India: Virat Kohli Immature, Cant Take Abuse says Kagiso Rabada

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో తన ప్రపంచకప్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతోంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ మాటల యుద్దానికి తెరలేపాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా.. అతడికి పరిపక్వత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వివాదానికి కారణం కోహ్లినే:

వివాదానికి కారణం కోహ్లినే:

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కోహ్లీతో రబాడ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని తాజాగా వివరిస్తూ... 'ఐపీఎల్‌లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. ఓ మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ నా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టాడు. అనంతరం నన్నేదో అన్నాడు. ఐతే నేను తిరిగి అతడిని అదే మాట అంటే కోపం తెచ్చుకున్నాడు' అని రబాడ తెలిపాడు.

భరించే శక్తి కోహ్లీకి లేదు:

భరించే శక్తి కోహ్లీకి లేదు:

'విరాట్ తనలో తాను ఉత్సాహం నింపుకోవడానికి ప్రత్యర్థుల్ని ఏదో ఒకటి అంటాడేమో. కానీ తిరిగి ఎవరైనా అంటే తట్టుకోలేడు. విరాట్‌ గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా.. తిట్లను భరించే శక్తి అతడికి లేదు. కోహ్లీ ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఇలాంటివి ఘటనలు నా ఏకాగ్రతను దెబ్బ తీయలేవు' అని రబాడ పేర్కొన్నాడు.

గొడవలు పడటం కొత్తేం కాదు:

గొడవలు పడటం కొత్తేం కాదు:

ఆటగాళ్లతో గొడవలు పడటం రబాడకు ఇది తొలిసారి కాదు. 2017లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. గతేడాది ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై కూడా మాటల యుద్ధం చేసాడు. స్మిత్‌తో శృతిమించి ప్రవర్తించడంతో మరోసారి సస్సెన్షన్‌కు గురయ్యాడు. టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Sunday, June 2, 2019, 10:52 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X