న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో బంగ్లా ఢీ.. సఫారీలు గాడిన పడేనా?

ICC Cricket World Cup 2019: South Africa vs Bangladesh: Match Preview, South Africa seek quick turnaround at slow and tacky Oval

ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఓవల్ మైదానం వేదికగా ఆదివారం జరిగే పోరులో ప్రమాదకర బంగ్లాదేశ్‌తో సఫారీ జట్టు తలపడనుంది. తొలిపోరు పరాజయా న్ని మరిచి.. రెండో మ్యా చ్‌ను సవాల్‌గా తీసుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బ్యాటింగ్ లైనప్ ప్రధాన సమస్య:

బ్యాటింగ్ లైనప్ ప్రధాన సమస్య:

దక్షిణాఫ్రికా జట్టు స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో సత్తా చాటే ఆటగాళ్లు ఉన్నారు. అయితే తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా బ్యాట్స్‌మన్‌లు పెవిలియన్ చేరడంతో ఓటమిని చవిచూసింది. ఓపెనర్లు డికాక్, ఆమ్లా మంచి ఫామ్‌లో ఉన్నారు. మార్‌క్రమ్‌ ఫామ్‌లో లేకున్నా.. కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఊపుమీదున్నాడు. మిడిలార్డర్‌లో జేపీ డుమిని ఉన్నా.. పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. డేవిడ్ మిల్లర్‌ తొలి మ్యాచ్ ఆడలేదు. దూసెన్ పరుగులు చేస్తుండడం సఫారీ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే లోయర్ ఆర్డర్‌‌లో జట్టుని ఆదుకునేందుకు సరైన బ్యాట్స్‌మన్ లేడు. ఈ మ్యాచ్‌లో అందరూ రాణించాల్సిన అవసరం ఉంది.

సఫారీల బలం బౌలింగే:

సఫారీల బలం బౌలింగే:

బౌలింగే సఫారీల ప్రధాన బలం. కగిసో రబాడ, డేల్ స్టెయిన్ లాంటి పదునైన బౌలింగ్‌‌ ఉంది. వీరికి తోడు లుంగి ఎంగిడి బౌన్స్‌, ప్రిటోరియస్‌ పేస్‌ జట్టుకు అదనపు బలం. ఇక ఇమ్రాన్‌ తాహిర్‌ రూపంలో మంచి స్పిన్నర్‌ ఆ జట్టులో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 12వ సీజన్‌లో తాహిర్ అద్భుతంగా రాణించాడు. అయితే ఇంగ్లాండ్ మ్యాచ్‌లో మోస్తరు ప్రదర్శన చేసాడు. డుమిని, మార్‌క్రమ్‌ కూడా స్పిన్ పంచుకోవడానికి సిద్ధం. అందరూ రాణిస్తే బంగ్లా జట్టుకు గెలుపు కష్టమే. అయితే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. బంగ్లాతో మ్యాచ్‌లోనూ ఆడే అవకాశాలు కనిపించట్లేదు.

మేటి జట్లకు షాక్ ఇవ్వగలదు:

మేటి జట్లకు షాక్ ఇవ్వగలదు:

టోర్నీలో తొలి మ్యాచ్‌ బరిలోకి దిగుతున్న బంగ్లాదేశ్‌.. గత ప్రపంచకప్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. కిందటిసారి ఆ జట్టు క్వార్టర్స్‌ దాకా వచ్చింది. తాజాగా భారత్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓడినా.. పుంజుకునే సత్తా ఉంది. సఫారీల లాగే బంగ్లా కూడా పటిష్టంగా ఉంది. తమీమ్ ఇక్బాల్, మొహమ్మదుల్లా, ముష్పికర్ రహీం, సౌమ్యా సర్కార్, షబ్బీర్ రెహమాన్లతో బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. ముస్తఫిజుర్ రెహమాన్, అబు జాయేద్, రూబెల్ హుస్సేన్, మోర్తజా, షకిబ్‌లు బౌలింగ్ భారం మోయనున్నారు. తొడ కండర గాయంతో ప్రపంచకప్‌లో బంగ్లా ఆడే తొలి మ్యాచ్‌కు దూరమయ్యేలా కనిపించిన కెప్టెన్‌ మష్రాఫె మొర్తజా ఫిట్‌నెస్‌ సాధించాడు. తమీమ్‌ ఇక్బాల్‌ కూడా ఫిట్‌నెస్‌ పరీక్ష నెగ్గాడు. మెగా టోర్నీలో తమదైన రోజున బంగ్లా మేటి జట్లకు కూడా షాక్ ఇవ్వగలదు. తొలి మ్యాచ్‌లో నెగ్గాలని బంగ్లా చూస్తోంది.

Story first published: Sunday, June 2, 2019, 10:10 [IST]
Other articles published on Jun 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X