న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిజర్వ్ డే ముందు రోజు రాత్రంతా నిద్రపోలేదు

ICC Cricket World Cup 2019: Ross Taylor revealed he couldnt sleep before batting

హైదరాబాద్: ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి సెమీపైనల్ మ్యాచ్‌లో రిజర్వ్ డే రోజు అయిన బుధవారం న్యూజిలాండ్ ఎదుర్కొనే 23 బంతులు ఎలా ఆడాలన్న దానిపై ఆ జట్టు వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్‌కు నిద్రపట్టలేదు. టోర్నీ షెడ్యూల్ ప్రకారం తొలి సెమీపైనల్ మంగళవారం(జులై 9)న ప్రారంభమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, న్యూజిలాండ్ 46.1 ఓవర్లకు గాను 211/5 స్థితిలో ఉన్న సమయంలో వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో అంఫైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్టేడియం సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు. ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గపోవడంతో మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. రిజర్వు డే అయిన బుధవారం తిరిగి ఆటను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రాత్రంతా నిద్ర‌ప‌ట్ట‌లేదు

రాత్రంతా నిద్ర‌ప‌ట్ట‌లేదు

ఈ నేపథ్యంలో రిజ‌ర్వ్‌డే రోజున న్యూజిలాండ్ ఎదుర్కొనే ఆ 23 బంతులను ఎలా ఆడాలనే దానిపై రాత్రంతా న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ టేల‌ర్‌కు నిద్ర‌ప‌ట్ట‌లేదంట. ఎందుకంటే వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి రాస్‌ టేలర్‌ (6), టామ్‌ లాథమ్‌ (3) క్రీజులో ఉన్నారు. దీంతో రాస్ టేలర్ మరుసటి రోజు 23 బంతులను ఎలా ఎదుర్కొనే ధ్యాస‌లో ఉండిపోయాడు.

తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌కే నిద్ర లేచాను

తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌కే నిద్ర లేచాను

ఈ విషయాన్ని రాస్ టేలరే స్వయంగా వెల్లడించాడు. "తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల‌కే నిద్ర లేచాను. నాకు తెలియదు, ఎలా బ్యాటింగ్ చేయాలనే ధ్యాసలోనే ఉండిపోయా. ఇది నిజంగా టెస్టు మ్యాచ్ ఫీలింగ్‌లాగా అనిపించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌గా నాటౌట్‌గా నిలవడంతో అవిశ్రాంతిగా అనిపించింది" అని రాస్ టేలర్ అన్నాడు.

వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్‌డేకు

వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్‌డేకు

టీమిండియాతో సెమీస్‌ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్‌డేకు పొడిగించిన త‌ర్వాత‌.. న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కొన్ని గంట‌లు గ‌డిపారు. కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌, రాస్ టేల‌ర్ ఎక్కువ సేపు డ్రెస్సింగ్ రూమ్‌లో సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో క‌నీసం 240 పరుగులు చేస్తే ఈ మ్యాచ్ గెలుస్తామ‌ని విలియ‌మ్సన్‌తో టేలర్ చెప్పాడు.

18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

18 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

దీంతో రిజర్వ్ డే రోజున క్రీజులోకి వచ్చిన కివీస్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా వికెట్లను కోల్పోయినప్పటికీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగుల చేశారు. ఈ మ్యాచ్‌లో రాస్ టేల‌ర్ 90 బంతుల్లో 74 ప‌రుగులు చేశాడు. అనంతరం లక్ష్య చేధనలో టీమిండియా టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, July 11, 2019, 18:00 [IST]
Other articles published on Jul 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X