|
నీ సహనం, ప్రశాంతత గొప్పవి:
తాజాగా రవిశాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... 'ఇలాంటి సమయంలో కూడా నువ్వు చూపిన సహనం, ప్రశాంతత గొప్పవి. ఫైనల్ మ్యాచ్ తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అద్భుతం. ప్రపంచకప్ టైటిల్ చేజారినప్పటికీ మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది' అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఆగ్రహించలేదు:
మ్యాచ్ అనంతరం బౌండరీ నిబంధన ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నామని నిరాశ వ్యక్తం చేశాడు తప్ప ఆగ్రహించలేదు. మ్యాచ్ బాగా జరిగిందని, అందరూ బాగా ఆస్వాదించారని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాకపోయినా.. ఎవరిపైనా విమర్శలు చేయకుండా తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. దీంతో రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం:
వివాదాస్పద ఆరు పరుగుల ఓవర్ త్రోపై విలియమ్సన్ మాట్లాడుతూ... 'మ్యాచ్ ఆఖరి క్షణాల్లో అంపైర్లు చేసిన పొరపాటును తెలుసుకుని ఆశ్చర్యపోయాం. నిబంధనలపై సంపూర్తి అవగాహన లేని మేం ఆ సమయంలో అంపైర్ల నిర్ణయాన్ని అంగీకరించాం. వందలకొద్దీ ఉన్న ఇతర నిబంధనల్లానే ఇదీ ఒకటని భావించాం. అంతే తప్ప భిన్నమైనదని అనుకోలేదు' అని తెలిపారు.

సూపర్ ఓవర్:
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలిచింది.