న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంకేయులు పోటీనిచ్చేనా?: ప్రపంచకప్‌లో నిలవాలంటే ఆసీస్‌పై నెగ్గాల్సిందే!

ICC Cricket World Cup 2019 Preview: Australia Eye Top Position With Win Over Unfortunate Sri Lanka

హైదరాబాద్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా మరో పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌లు వర్షార్పణంతో డీలా పడిన శ్రీలంక జట్టుతో శనివారం తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక జూన్‌ 4 తర్వాత మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో జరగాల్సిన మ్యాచ్‌లు కనీసం టాస్‌ కూడా పడకుండానే రద్దయ్యాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఈ జట్టు 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దీంతో లంకేయులు నాకౌట్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి నాలుగు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. అయితే, లంకేయులను నిలకడే లేని బ్యాటింగ్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.

న్యూజిలాండ్‌తో చేతులేత్తేసిన బ్యాట్స్‌మెన్‌

న్యూజిలాండ్‌తో చేతులేత్తేసిన బ్యాట్స్‌మెన్‌

న్యూజిలాండ్‌తో చేతులేత్తేసిన బ్యాట్స్‌మెన్‌... ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌లో సైతం ఆపసోపాలు పడ్డారు. అయితే, చివర్లో బౌలర్లు చెలరేగడంతో ఆ మ్యాచ్‌‌లో విజయం సాధించింది. ఇక, బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరా మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిడిలార్డర్ పూర్తిగా విఫలమయ్యారు.

భారత్‌ చేతిలో ఓడినా..

భారత్‌ చేతిలో ఓడినా..

బౌలింగ్‌లో మలింగ, నువాన్‌ ప్రదీప్‌లు ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో సెమీస్‌ దిశగా దూసుకెళుతోంది. లంకపై గెలిచి నాకౌట్‌కు మరింత దగ్గర కావాలని ఆరోన్ ఫించ్ సేన ఉవ్విళ్లూరుతోంది. భారత్‌ చేతిలో ఓడినా.. పాక్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో ఆస్ట్రేలియా మళ్లీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

పాక్‌పై సెంచరీ కొట్టిన వార్నర్‌

పాక్‌పై సెంచరీ కొట్టిన వార్నర్‌

పాక్‌పై సెంచరీ కొట్టిన వార్నర్‌, హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌లపై జట్టు మేనేజ్‌మెంట్ అంచనాలు పెట్టుకుంది. నాథన్ కౌల్టర్ నైల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టుని ఆదుకుంటున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే శ్రీలంక శక్తికిమించి ఆడాల్సిందే.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

శ్రీలంక: కరుణరత్నే (కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, తిరిమన్నె, కుశాల్‌ మెండిస్, మాథ్యూస్, డిసిల్వా, తిసారా పెరీరా, ఉదాన, లక్మల్, ప్రదీప్, మలింగ.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, మార్ష్, క్యారీ, కూల్టర్‌ నైల్, కమిన్స్, స్టార్క్, జంపా.

మ్యాచ్ మధ్యాహ్నాం 3 గంటలకు

లైవ్ - స్టార్ స్పోర్ట్స్‌లో

1
43664

{headtohead_cricket_1_7}

Story first published: Saturday, June 15, 2019, 9:16 [IST]
Other articles published on Jun 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X