న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏ కెప్టెన్‌లోనూ చూడలేదు'

Virat Kohli Is blessed With A Confidence Like No One Else : Viv Richards
ICC Cricket World Cup 2019: Pakistanis love Kohli & Indias bowling attack better than Pakistan says Younis Khan

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏ కెప్టెన్‌లోనూ చూడలేదు అని వెస్టిండీస్ మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్‌ వివ్‌ రిచర్డ్స్‌ అన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా సలాం క్రికెట్‌ 2019లో వివ్‌ రిచర్డ్స్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచకప్‌ కెప్టెన్‌ల గురించి మాట్లాడుతూ.. కోహ్లీ గురించి కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఓటమిని ఒప్పుకోడు:

ఓటమిని ఒప్పుకోడు:

వివ్‌ రిచర్డ్స్‌ మాట్లాడుతూ... 'కోహ్లీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏ కెప్టెన్‌లోనూ చూడలేదు. ఆత్మవిశ్వాసం ఒక రాత్రిలో వచ్చేది కాదు. ఎంతో శ్రమించి బాగా ఆడితేనో లేదా పుట్టుకతో రావాలి. కోహ్లీ ఓ పోరాట యోధుడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటమిని ఒప్పుకోడు. జట్టుని గెలిపించడానికే ప్రయత్నిస్తాడు. అది సరైన పద్ధతి' అని రిచర్డ్స్‌ పేర్కొన్నాడు.

దూకుడు లేకపోతే.. ఎలా:

దూకుడు లేకపోతే.. ఎలా:

'కోహ్లీ లాంటి కెప్టెన్‌ అంటే ఇష్టం. అతడి దూకుడే విజయాలను అందిస్తుంది. కెప్టెన్‌కు దూకుడు లేకపోతే.. మ్యాచ్‌ గెలవడం కష్టం. కెప్టెన్సీలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. అలా కోహ్లీ కూడా ఓ ప్రత్యేక శైలిని అనుసరిస్తాడు. ప్రతీ ఆటగాడు ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటాడు. తమ జట్టు విజేతగా నిలవాలని కోరుకుంటాడు. అదే కోహ్లీలో కూడా ఉంది' అని రిచర్డ్స్‌ తెలిపారు.

పాకిస్థాన్‌లోనూ అభిమానులు:

పాకిస్థాన్‌లోనూ అభిమానులు:

పాక్ మాజీ క్రికెటర్‌ యూనిస్‌ ఖాన్‌ మాట్లాడుతూ... 'ఇండియా బౌలింగ్ పాకిస్థాన్ కంటే బలంగా ఉంది. ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియాకు కోహ్లీయే కీలకం. పాకిస్థాన్‌లోని చాలా మంది యువ ఆటగాళ్లు కోహ్లీలా ఆడాలనుకుంటున్నారు. కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్‌లోనూ ఉన్నారు. ఆసియా కప్‌లో అతడు ఆడకున్నా.. మైదానాలు నిండిపోయాయి' అని యూనిస్‌ ఖాన్‌ గుర్తు చేశారు.

Story first published: Monday, June 3, 2019, 14:54 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X