న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌.. హిట్టింగ్‌ చేయలేక సర్ఫరాజ్‌ భయపడ్డాడా?

ICC Cricket World Cup 2019: Sarfaraz, Who Came To Bat At 8th Place In South Africa VS Pak Match
ICC Cricket World Cup 2019, Pakistan vs South Africa: Sarfaraz Ahmed batting at number 8 against South Africa, is he afried?

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌పై పరాజయం తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విరుచుకుపడ్డారు. ఆ వివాదం సమసిపోకముందే పాక్ అభిమానులు మళ్లీ సర్ఫరాజ్‌పై విరుచుకుపడుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి పాక్ ముందుగా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (58 బంతుల్లో 44; 6 ఫోర్లు), ఫఖర్‌ జమాన్‌ (50 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. తర్వాత బాబర్‌ ఆజమ్ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు), హరిస్‌ సొహైల్‌ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అయితే టాపార్డర్‌ భారీ స్కోర్ చేసిన సమయంలో కెప్టెన్‌ సర్పరాజ్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే సర్పరాజ్‌.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ దిగడమే చర్చనీయాంశమైంది. ఇమాద్‌ వసీం ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు రావాలి. ఇమాద్‌ ఔట్‌ అయిన అనంతరం వహాబ్‌ రియాజ్‌ బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికి 48 ఓవర్లు పూర్తయ్యాయి. జట్టు స్కోర్ 295. ఈ సమయంలో భారీ హిట్టింగ్ చేయాలి. కానీ వహాబ్‌ 4 బంతుల్లో 4 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఈ స్థానంలో సర్పరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే పాక్‌ స్కోరు మరింత పెరిగేది.

ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న సర్పరాజ్‌.. రెండు పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒకవేళ ముందు వచ్చిఉంటే మరిన్ని పరుగులు చేసేవాడు. సర్ఫరాజ్‌ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం పాక్ అభిమానులను ఆలోచనలో పడేసింది. అసలు సర్పరాజ్‌ బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధం కాలేదా? లేదా హిట్టింగ్‌ చేయలేక భయపడ్డాడా? అని పాక్ అభిమానులు అంటున్నారు. మ్యాచ్ గెలిచింది కాబట్టి సర్ఫరాజ్‌ బతికిపోయాడు కానీ.. లేదంటే అతడి పరిస్థితి మరోలా ఉండేది.

Story first published: Monday, June 24, 2019, 8:13 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X