టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

ICC Cricket World Cup 2019, Pakistan vs South Africa: Pakistan have won the toss and have opted to bat

లండన్‌ లోని లార్డ్స్ మైదానం వేదికగా పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హ్యారిస్ సోహైల్, షహీన్ ఆఫ్రిది జట్టులోకి వచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి.. ఒకటి గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దుకావడంతో 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. పాక్‌ ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓడగా.. ఒకటి గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దయింది. దీంతో ప్రస్తుతం 3 పాయింట్లతో పాక్ తొమ్మిదో స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించగా.. పాక్ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే తమ మిగతా మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో పాక్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు టీమిండియాతో ఓటమిపాలైన పాకిస్థాన్‌పై అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వారిపై మరింత ఒత్తిడి నెలకొంది.

ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫఖర్‌ జమాన్‌, బాబర్‌ ఆజమ్‌, కెప్టెన్‌ సర్ఫరాజ్‌తో పాక్ బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. మహ్మద్‌ ఆమిర్‌, హసన్‌ అలీ, వాహబ్‌ రియాజ్‌ బౌలింగ్‌ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, కెప్టెన్‌ డుప్లెసి బ్యాటింగ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. రబాడ, లుంగిడి ఎన్‌గిడి, క్రిస్‌ మోరిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌తో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది.

Teams:

South Africa: Quinton de Kock(w), Hashim Amla, Faf du Plessis(c), Aiden Markram, Rassie van der Dussen, David Miller, Andile Phehlukwayo, Chris Morris, Kagiso Rabada, Lungi Ngidi, Imran Tahir.

Pakistan: Imam-ul-Haq, Fakhar Zaman, Babar Azam, Mohammad Hafeez, Haris Sohail, Sarfaraz Ahmed(w/c), Imad Wasim, Shadab Khan, Wahab Riaz, Mohammad Amir, Shaheen Afridi.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, June 23, 2019, 15:00 [IST]
Other articles published on Jun 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more