న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టికెట్లు దొరకడం లేదు.. ఫైనల్ వరకు ఇంగ్లాండ్‌లోనే భారత ఆటగాళ్లు

ICC Cricket World Cup 2019: No tickets, India players and staf stranded in England till final

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్నీ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన కారణంగా భారత జట్టు, కోచ్‌లు, సహాయక సిబ్బంది తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే టికెట్లు సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. దీంతో ఆదివారం వరకూ అందరూ మాంచెస్టర్‌లోనే ఉండనున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మాంచెస్టర్‌లోనే:

మాంచెస్టర్‌లోనే:

'చాలా మంది ఆటగాళ్లు మాంచెస్టర్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్లకి టికెట్లు సర్దుబాటు చేస్తున్నాం. అక్కడి నుంచే స్వదేశానికి వస్తారు. అందులో కొందరే భారత్‌కు తిరిగి వస్తారు. మిగతా వారు రెండు వారాల పాటు ఎక్కడికైనా విహారానికి వెళ్తారు. వారికి టికెట్లు సర్దుబాటు చేస్తున్నాం. టిక్కెట్ల లభ్యత ప్రకారం ఆటగాళ్ళు తమ ఇష్టపడే ప్రదేశానికి వెళుతారు' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

నేరుగా రాంచీకి ధోనీ:

నేరుగా రాంచీకి ధోనీ:

ఆగస్టు 3 నుంచి పరిమిత ఓవర్లు, టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. రెండు వారాల విరామం ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు టికెట్ల లభ్యతను బట్టి బ్యాచ్‌లుగా ఇంగ్లండ్‌ నుంచి భారత్ చేరుకుంటారు. అయితే కొందరు అక్కడే ఎంజాయ్ చేసి ఇంటి ముఖం పట్టనుండగా.. ఎంఎస్ ధోనీ మాత్రం నేరుగా రాంచీ రానున్నాడు.

 క్రిస్‌గేల్‌కు చివరిది:

క్రిస్‌గేల్‌కు చివరిది:

వచ్చేనెల మూడు నుంచి నెలరోజుల పాటు అమెరికాలో విండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ విండీస్ డాషింగ్ ఓపెనర్, 'యూనివర్స్‌ బాస్‌' క్రిస్‌గేల్‌కు చివరిది. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ సిరీస్‌లో ధోనీ ఆడుతాడో లేదో చూడాలి.

సెమీస్‌తోనే ఆగిన ప్రస్థానం:

సెమీస్‌తోనే ఆగిన ప్రస్థానం:

సెమీ ఫైనల్లో కివీస్ నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమయింది. 14 పరుగులకే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లు పెవిలియన్ చేరారు. దినేష్ కార్తీక్ (6) కూడా వెనుతిరగడంతో టీమిండియా గెలుపు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. పంత్ (32) , పాండ్యా (32 )కొద్దిసేపు క్రీజులో ఉన్నా.. అనవసర షాట్లు ఆడి ఔట్ అయ్యారు. అనంతరం రవీంద్ర జడేజా (77), ఎంఎస్ ధోనీ (50) పోరాడినా.. కీలక సమయంలో ఇద్దరూ ఔట్ అవ్వడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో సెమీస్‌తోనే భారత్ ప్రస్థానం ముగిసింది.

Story first published: Friday, July 12, 2019, 12:52 [IST]
Other articles published on Jul 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X