న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాబర్‌ అజామ్‌కు మంచి భవిష్యత్ ఉంది.. ఎదోఒకరోజు కోహ్లీ స్థాయికి చేరుతాడు

ICC Cricket World Cup 2019, New Zealand vs Pakistan: Babar Azam can match Virat Kohli’s feats one day says Pak batting coach

పాకిస్థాన్ యువ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ను ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. బాబర్‌ అజామ్‌కు మంచి భవిష్యత్ ఉంది. ఎదోఒకరోజు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థాయికి చేరుతాడు అని అభిప్రాయపడ్డాడు. బాబర్‌ అజామ్‌ న్యూజిలాండ్‌పై అద్భుతమైన బ్యాటింగ్‌ (127 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కూడా అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కోహ్లీ స్థాయికి చేరుతాడు:

కోహ్లీ స్థాయికి చేరుతాడు:

తాజాగా పాక్ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ మాట్లాడుతూ... 'బాబర్‌ అజామ్‌ బ్యాటింగ్ అద్భుతం. అతడి బ్యాటింగ్ చాలా ప్రత్యేకం. పాక్‌ జట్టులో అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదుగుతాడు. అతను యువకుడు. ఫిట్‌నెస్‌ కూడా బాగానే ఉంది. ఇలానే ఒదిగి ఉంటే కచ్చితంగా అతనికి గొప్ప కెరీర్‌ ఉంటుంది. పరుగులు సాధించాలని విరాట్‌లోని తపనే అతడిలో కూడా ఉంది. ఎదోఒకరోజు కోహ్లీ స్థాయికి చేరుతాడు' అని గ్రాంట్‌ ఫ్లవర్‌ అభిప్రాయపడ్డాడు.

అగ్రస్థానంలో ఎందుకు ఉండడు:

అగ్రస్థానంలో ఎందుకు ఉండడు:

'సాధ్యమైనంత కఠినంగా సాధన చేస్తే, నైపుణ్యాలు ఉంటే అగ్రస్థానంలో బాబర్‌ ఎందుకు ఉండడు?. గత రెండుమూడు రోజులుగా బాబర్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. మ్యాచ్‌కు ముందురోజు మాత్రమే సాధన చేయలేదు. అతడికి ఇదే అత్యుత్తమ సెంచరీ. ఫ్లాట్‌ పిచ్‌లపై అతడి సెంచరీ చూశాను. ఇది మాత్రం కఠినమైన వికెట్‌. బంతి టర్న్‌ అయింది. ప్రపంచకప్‌ కాబట్టి ఒత్తిడి సహజమే' అని ఫ్లవర్‌ పేర్కొన్నారు.

రెండూ గెలవాల్సిందే:

రెండూ గెలవాల్సిందే:

భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాకిస్థాన్‌ తిరిగి పుంజుకుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ను చిత్తుచేసి ప్రపంచకప్‌ సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నది. పాక్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచింది. మూడింట్లో ఓడిపోగా.. ఓ మ్యాచ్‌ రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సిన మ్యాచ్‌ల్లో పాక్ తప్పక గెలవాల్సి ఉంటుంది. అన్నీ గెలిస్తే మొత్తం 11 పాయింట్లతో నాకౌట్‌ చేరే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది.

Story first published: Thursday, June 27, 2019, 16:02 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X