న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆటను ఆస్వాదించినంత కాలం ధోనీని ఆడనివ్వాలి'

Glenn McGrath Makes Bold Statement On Dhoni’s Future In Team India || Oneindia Telugu
ICC Cricket World Cup 2019: MS Dhoni should keep playing as long as he enjoys the game says Australian Ace pace Bowler Glenn McGrath

ఆటను ఆస్వాదించినంత కాలం టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీని ఆడనివ్వాలి అని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ సూచించారు. ప్రపంచకప్‌ తర్వాత ధోనీ రిటైర్మెంట్‌ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెక్‌గ్రాత్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఝార్ఖండ్‌ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు మెక్‌గ్రాత్‌ రాంచీ వచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ సందర్భంగా మెక్‌గ్రాత్‌ మాట్లాడుతూ... 'టీమిండియాకు ధోనీ ఏంతో సేవ చేసాడు. రెండు ప్రపంచకప్‌లు అందించాడు. అతడి కెప్టెన్సీ అద్భుతం. ఎంతోమంది యువ ఆటగాళ్లకు నిదర్శనం. ఆటను ఆస్వాదించినంత కాలం ధోనీని ఆడనివ్వాలి. ప్రపంచకప్‌ తర్వాత కూడా ధోనీ ఆటను కొనసాగించాలి' అని మెక్‌గ్రాత్‌ అన్నారు. ఝార్ఖండ్‌ స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ శిబిరంలో మెక్‌గ్రాత్‌ అక్కడి బౌలర్లకు మెలకువలు నేర్పాడు. మెక్‌గ్రాత్‌ టెస్టుల్లో 563, వన్డేల్లో 381 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్‌లో గత ఆదివారం పాకిస్థాన్‌పై ఆడిన వన్డే ధోనీకి 344వది. దీంతో భారత్‌ తరఫున దిగ్గజ ఆటగాడు సచిన్‌ (463) తర్వాత ద్రవిడ్‌తో సమానంగా నిలిచాడు. శనివారం అఫ్గాన్‌తో మ్యాచ్ ద్వారా ద్రవిడ్‌ను కూడా వెనక్కినెట్టనున్నాడు. ధోనీ 344 వన్డేలలో 10562 పరుగులు చేసాడు. వన్డేలలో అతనికి 183 పరుగులు అత్యధికం.

భారత్ తన తదుపరి మూడు మ్యాచ్‌లను ఆఫ్గనిస్తాన్ (జూన్ 22), వెస్టిండీస్ (జూన్ 27), ఇంగ్లాండ్ (జూన్ 30)లతో ఆడనుంది. స్టార్ పేసర్ భువనేశ్వర్‌కు ఎడమ తొడకండరాలు పట్టేయడంతో ఈ మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భువీ స్థానంలో షమీ జట్టులోకి రానున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, June 20, 2019, 14:38 [IST]
Other articles published on Jun 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X