న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహల్‌ టీవీ షోను నిరాకరించిన ధోనీ (వీడియో)

ICC Cricket World Cup 2019: MS Dhoni guest appearance on Chahal TV, Kuldeep listens to Kishore Kumar songs

టీమిండియా స్టార్ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ నిర్వహించే 'చాహల్‌ టీవీ'ను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిరాకరించాడు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా.. మనం చాహల్‌ టీవీని చూస్తున్నాం. ఇందులో చాహల్‌ అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ కోసం లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్తున్న బస్సులో చాహల్‌ తన టీవీ షోని కొనసాగించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కుల్‌దీప్‌ ఎవరితో మాట్లాడుతున్నాడో కనుక్కో:

ధోనీ వద్దకు వచ్చి తన షోలో పాల్గొనమని చాహల్‌ అడగ్గా.. అందుకు అతను నిరాకరించాడు. ఇక చేసేదేంలేక ధోనీ ముందు కూర్చున్న కుల్‌దీప్‌ యాదవ్‌ వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో కుల్‌దీప్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని ఉన్నాడు. కుల్‌దీప్‌ ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నాడో కనుక్కోమని చాహల్‌ని ధోనీ కోరాడు. ఇదే విషయం కుల్‌దీప్‌ను అడగ్గా.. కిషోర్‌కుమార్‌ పాటలు వింటున్నానని చెప్పాడు.

టీవీలో కనిపించడం ఇష్టం లేదు:

అనంతరం కేఎల్‌ రాహుల్‌ వద్దకు వెళ్లి తన షో కొనసాగించాడు. 'చాహల్‌ టీవీలో కనిపించడం ఇష్టం లేదు. కానీ పబ్‌జీ ఆడేటప్పుడు సమయం దొరికితే చాహల్‌ని కలవడం మాత్రం ఇష్టం' అని తెలిపాడు. రోహిత్ మాట్లాడుతూ... 'బస్సుల్లో నీతో ఇలా లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్లడం సంతోషంగా ఉంది' అని అన్నారు.

మద్దతుగా నిలవాలి:

మద్దతుగా నిలవాలి:

భువనేశ్వర్‌ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్‌లో అందరం మంచి ప్రదర్శన చేస్తాం. టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలవాలి' అని అభిమానులను కోరాడు. దినేశ్‌ కార్తిక్‌ మాట్లాడుతూ... 'చాహల్‌ టీవీ ద్వారా మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ షోలో పాల్గొనడం అంత సులువు కాదు. ఇది చాలా పెద్ద విషయం' అని చెప్పుకొచ్చాడు. ఆపై 'చాహల్‌ తన టీవీషోని ఆపేస్తూ.. మరిన్ని ఫన్నీ వీడియోలతో త్వరలోనే మీ ముందుకు వస్తానని చాహల్‌ చెప్పాడు. ఈ వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Story first published: Tuesday, May 28, 2019, 17:45 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X