న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్: అరుదైన రికార్డుకి చేరువలో షకీబ్ ఉల్ హాసన్

ICC Cricket World Cup 2019: Match 5, South Africa vs Bangladesh – Match Preview

హైదరాబాద్: వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 104 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దెబ్బకు సఫారీ ఓపెనర్లు కుప్పకూలగా... ఆ తర్వాత మిగతా 8 వికెట్లు కేవలం 75 పరుగులలోపే కోల్పోయి ఓటమిని మూటగట్టుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా ఆదివారం సఫారీలు బంగ్లాదేశ్‌తో తలపడనున్నారు. దీంతో బంగ్లాదేశ్‌పై నెగ్గి తొలి విజయాన్ని ఆస్వాదించాలని చూస్తున్నారు. మరోవైపు వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీల్లో బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మెగా టోర్నీకి ముందు జరిగిన ముక్కోణపు వన్డే సిరిస్‌ను గెలిచి బంగ్లా మంచి ఊపు మీదుంది.

1
43646

ఈ నేపథ్యంలో గత వరల్డ్‌కప్‌ల్లో బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

1 - బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరగనుంది. ఈ వేదికలో గతంలో దక్షిణాఫ్రికా ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా శ్రీలంకపైనే సాదించడం విశేషం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో లంకేయులుపై సఫారీలు విజయం సాధించారు.

2 - ఎనిమిది వరల్డ్‌కప్ ఎడిషన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. 2003లో వెస్టిండిస్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కేవలం 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఆ తర్వాత కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 10 వికెట్ల తేడాతో విజయం సాధించారు.

16.76 - బంగ్లాదేశ్‌పై సఫారీ పేసర్ కగిసో రబాడ బౌలింగ్ యారవేజి ఇది. బంగ్లాతో జరిగిన ఆరు వన్డేల్లో రబాడ 13 వికెట్లు తీశాడు.

17 - 2018 తర్వాత దక్షిణాఫ్రికా 17 వన్డే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఇంగ్లాండ్ 36 మ్యాచ్‌లాడి 25 మ్యాచ్‌ల్లో నెగ్గగా... కోహ్లీసేన 33 వన్డేలకు గాను 22 వన్డేల్లో విజయం సాధించింది.

24.5 - బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన్ ప్రతి 24.5 బంతులకు గాను ఓ సఫారీ వికెట్‌ను పడగొట్టాడు. సఫారీలతో మొత్తం 6 వన్డేలాడి 12 వికెట్లు తీశాడు.

7923 - ఇప్పటివరకు సఫారీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా వన్డేల్లో చేసిన పరుగులు. తాను ఆడబోయే మరో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆమ్లా 77 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని సాధించిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు పొందుతాడు.

11000 - బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్ వన్డేల్లో మరో 5 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 11000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. బంగ్లాదేశ్ తరపున తమీమ్ ఇక్బాల్(12519) పరుగులతో ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.

Story first published: Saturday, June 1, 2019, 15:49 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X