న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో విండిస్‌పై సెంచరీ: చరిత్ర సృష్టించిన జో రూట్

ICC Cricket World Cup 2019 : Joe Root Sets England Record In World Cup Victory Over West Indies
ICC Cricket world Cup 2019: Joe Root sets England record in World Cup victory over West Indies

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన రికార్డు నెల కొల్పాడు. ఈ మ్యాచ్‌లో జో రూట్ 93 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో జో రూట్‌కి ఇది రెండో సెంచరీ కాగా వన్డేల్లో 16 సెంచరీ.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు మొత్తంగా ప్రపంచకప్‌లో జో రూట్‌కి ఇది మూడో సెంచరీ. తద్వారా వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. జో రూట్ తర్వాత ఈ జాబితాలో కెవిన్ పీటర్సన్(2 సెంచరీలు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

జో రూట్‌కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో జో రూట్‌కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా జో రూట్ మాట్లాడుతూ "సెంచరీ సాధించడంతో పాటు మ్యాచ్‌ గెలవడం చాలా సంతోషంగా ఉంది. బ్యాట్స్‌మన్‌గా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడం గర్వంగా ఉంది. ఇది జట్టు సమష్టి విజయం" అని పేర్కొన్నాడు.

8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం

8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం

కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో జో రూట్ బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఒకే వన్డేలో సెంచరీతో పాటు రెండు వికెట్లు తీసి రెండు క్యాచ్‌లు పట్టాడు. 1996 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రూట్‌ చరిత్ర సృష్టించాడు.

1996 వరల్డ్‌కప్‌లో అరవింద డిసిల్వా

లాహోర్‌ వేదికగా జరిగిన 1996 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో శ్రీలంక ఆటగాడు అరవింద డిసిల్వా సెంచరీ బాదడంతో పాటు బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి రెండు క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు మళ్లీ జో రూట్ ఆ ఘనత సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైన విండిస్

44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైన విండిస్

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 44.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. క్రిస్‌గేల్‌(36), నికోలస్‌ పూరన్‌ (63), హెట్మేయర్‌(39) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్‌లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. జో రూట్ 2 వికెట్లు తీసుకోగా, వోక్స్, ప్లంకెట్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

ఇంగ్లాండ్‌కు ఇది మూడో విజయం

విండిస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని 33.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇది మూడో విజయం కాగా, వెస్టిండిస్‌కు రెండో ఓటమి. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో జో రూట్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. వెస్టిండిస్ బౌలర్లలో గాబ్రియల్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు.

1
43662
Story first published: Saturday, June 15, 2019, 13:29 [IST]
Other articles published on Jun 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X