న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రాకెట్‌ సైన్స్‌'పై బుమ్రా స్పందన: హార్డ్‌ వర్క్‌ను ఏదీ భర్తీ చేయలేదు

ICC Cricket World Cup 2019: Jasprit Bumrah reaction over IIT Professor who revealed the science behind his success

భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. బుమ్రా తన వేగంతో ప్రపంచంలోని అత్యుత్తమ బాట్స్‌మెన్‌‌కు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ఏ సమయంలో బౌలింగ్‌కు దిగినా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సైతం పరుగులు ఇవ్వకుండా బంతులు వేస్తున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్ విజయం వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ-కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌ కనిపెట్టాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

బుమ్రా బౌలింగ్‌పై అధ్యయనం చేసిన మిట్టల్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1,000 RPMతో బుమ్రా బంతులు వేస్తున్నాడు కాబట్టి.. 0.1 స్పిన్ నిష్పత్తిలో ఆ బంతికి స్పిన్ తోడయి 'రివర్స్‌ మాగ్నస్‌ ఎఫెక్ట్‌'లోకి మార్చుతుందని తన అధ్యయనంలో తెలిపారు. తాజాగా మిట్టల్‌ అధ్యయనంపై బుమ్రా స్పందించాడు.

'హార్డ్‌ వర్క్‌ను ఏదీ భర్తీ చేయదు (రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌ కూడా)' అంటూ బుమ్రా ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు ఈ తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'ప్రపంచకప్‌లో ఇదే ప్రదర్శన కొనసాగాలి', ప్రపంచకప్‌ సాదించుకురా', 'నిజంగా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ బుమ్రా.. హ్యాట్సాఫ్', 'ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపిస్తాడు' అని కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Tuesday, May 21, 2019, 14:57 [IST]
Other articles published on May 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X