న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో భారత్‌ చివరి లీగ్ మ్యాచ్‌.. అగ్రస్థానం కోసం భారత్ ఆరాటం

ICC Cricket World Cup 2019 : India Vs Sri Lanka Match Preview ! || Oneindia Telugu
ICC Cricket World Cup 2019, India vs Sri Lanka match Preview: Leeds Weather, Headingley Pitch Report and Stadium Records, ODI Stats and History, Winning, Losing, Tied

ఇప్పటికే భారత్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే అగ్రస్థానం ఆస్ట్రేలియాదా, భారత్‌దా అనే విషయం ఈ రోజు తేలనుంది. ఈ నేపథ్యంలో భారత్ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే లంకపై నెగ్గితే సరిపోదు, ఈ రోజు జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు) దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. ఇది జరిగితే భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. భారత్‌ అగ్రస్థానం సాధిస్తే న్యూజిలాండ్‌తో.. రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడుతుంది. పటిష్ట ఇంగ్లాండ్‌ కంటే న్యూజిలాండ్‌తో ఆడాలని భారత్ కోరుకుంటోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రోహిత్, కోహ్లీ ప్రధాన బలం:

రోహిత్, కోహ్లీ ప్రధాన బలం:

సెమీస్‌లో స్థానం ఖాయమైనప్పటికీ ఈ మ్యాచ్‌ భారత్‌కు ముఖ్యమైనదే. ఎవరికైనా విశ్రాంతిని ఇవ్వాలన్నా.. బెంచ్ ఆటగాళ్లను ఆడించాలన్నా.. ఎవరైనా కుదురుకోవాలన్నా ఈ మ్యాచ్‌తో జరిగిపోవాలి. ఓపెనర్ రోహిత్‌ శర్మ జట్టు ప్రధాన బలం. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వెన్నెముక. ఇద్దరు పరుగులు చేస్తుండంతోనే భారత్ విజయాలు సాధిస్తోంది. మోస్తరుగా రాణిస్తున్న ఓపెనర్‌ రాహుల్‌ స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు.

మిడిల్‌ ఆర్డర్‌ సమస్య:

మిడిల్‌ ఆర్డర్‌ సమస్య:

టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడినా.. మిడిల్‌ ఆర్డర్‌ మాత్రం గాడిన పడలేదు. మిడిల్‌ ఆర్డర్‌ గాడినపడేందుకు ఈ మ్యాచ్ మంచి అవకాశం. నాలుగో స్థానంలో రెండు చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించిన పంత్‌ చోటు ఖాయం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ విఫలం కాగా.. ఆడింది ఒకే మ్యాచ్‌ కాబట్టి కార్తీక్‌కు మరో అవకాశం దక్కవచ్చు. ఇక మాజీ కెప్టెన్‌ ధోనీ స్లో బ్యాటింగ్ కలవరపెడుతోంది. సెమీస్ ముందు గాడిలో పడితే మంచిది. పాండ్యా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

భువీ, షమీలలో ఒక్కరే:

భువీ, షమీలలో ఒక్కరే:

పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశమున్నందున భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు చాహల్‌, కుల్‌దీప్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో పేసర్లు భువనేశ్వర్‌, షమీలలో ఒక్కరే జట్టులో ఉండొచ్చు. షమీ వికెట్లు తీస్తున్నా.. ధారాళంగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో భువీ జట్టులో ఉండనున్నాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి పరుగుల ప్రవాహంను ఆడ్డుకోనున్నాడు. అయితే జట్టులో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాని రవీంద్ర జడేజాను కూడా బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోంది.

బౌలింగే బలం:

బౌలింగే బలం:

గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన యువ ఆటగాడు అవిష్క ఫెర్నాండో మరోసారి చెలరేగనున్నాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. కుషాల్ మెండీస్, కుషాల్ పెరీరా, మాథ్యూస్ కూడా రాణిస్తే లంక భారీ స్కోరు చేయగలదు. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే లంక బౌలింగే బలంగా ఉంది. పేసర్ లసిత్ మలింగ అవకాశాలు లేని చోటు నుంచి కూడా జట్టుకు విజయాల బాట వేస్తున్నాడు. మలింగ, ఉడానా, రజిత, ధనంజయలతో బౌలింగ్ ఉంది. అయితే వీరు భారత బ్యాట్స్‌మెన్‌ను ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

ముఖాముఖి రికార్డు:

ముఖాముఖి రికార్డు:

భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు ఆడాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్‌.. 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్‌ ‘టై' అయింది. ఇక 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరోవైపు ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్‌.. 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్‌ రద్దయింది. లీడ్స్‌ బ్యాటింగ్‌ పిచ్‌. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. కొంత వరకు స్పిన్‌కు అనుకూలించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

 తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మొహ్మద్ షమీ /భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా.

శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), కుశాల్‌ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్, ఏంజిలో మాథ్యూస్, తిసార పెరీరా, ధనంజయ డిసిల్వా, ఉరుసు ఉదాన, లసిత్ మలింగ, కాసున్ రజిత, జెఫ్రీ వాండర్సే.

Story first published: Saturday, July 6, 2019, 11:28 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X