న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సానియాపై విమర్శలను ఖండించిన మాజీలు.. వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు

ICC Cricket World Cup 2019: India vs Pakistan: Virender Sehwag, Shoaib Akhtar Shut Down Trolls Who Blamed Sania Mirza For Pakistan’s Defeat

ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌, పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌లు అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం భారత్‌ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిన తర్వాత పాక్‌ అభిమానులు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. సోషల్‌ మీడియాలో ఆ దేశ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్.. షోయబ్‌ మాలిక్‌, అతని భార్య సానియా మిర్జాపై.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

సానియాకు అండగా:

సానియాకు అండగా:

మ్యాచ్‌కు ముందురోజు రాత్రి తన భార్య సానియా మిర్జాతో కలిసి షోయబ్‌ మాలిక్‌ డిన్నర్‌కు వెళ్లాడని, అందుకే పాకిస్థాన్‌ మ్యాచ్ ఓడిపోయిందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సెహ్వాగ్‌, అక్తర్‌లు స్పందించారు. షోయబ్‌ అక్తర్ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్లు మాట్లాడి సానియాకు అండగా నిలిచారు.

తప్పేముంది:

తప్పేముంది:

'పాకిస్థాన్‌ ఓటమికి సానియానే కారణమని అభిమానులు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావు. అలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. మాలిక్ తన భర్త. భోజనం చేసేందుకు కలిసి బయటకు వెళ్లారు. అందులో తప్పేముంది. మ్యాచ్ ఉంటే భోజనం కూడా చేయోద్దా?. అసలు పాక్ ఓటమికి సానియాకు ఏమైనా సంబంధం ఉందా' అని అక్తర్ ప్రశ్నించాడు.

ఆ హక్కు ఎవరికీ లేదు:

ఆ హక్కు ఎవరికీ లేదు:

సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. వ్యక్తిగత జీవితాన్ని, క్రికెట్ కెరీర్‌కు ముడిపెట్టడం సరికాదు. గతంలో విరాట్‌ కోహ్లీ ,అనుష్క శర్మల విషయంలోనూ ఇదే చెప్పా. అభిమానులు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను నిందించడం మంచి పద్దతి కాదు. మాలిక్‌, సానియా ఎక్కడికెళ్లారు? ఏం తిన్నారు? అనేది వాళ్ల వ్యక్తిగతం. మ్యాచ్‌ సందర్భంగా మాలిక్ సన్నద్ధమవ్వాలి. సానియాకు ఎలాంటి సంబంధం లేదు' అని సెహ్వాగ్‌ పేర్కొన్నారు.

బర్గర్లు తింటే తప్పేంటి:

బర్గర్లు తింటే తప్పేంటి:

ఈ విమర్శలపై హర్భజన్‌ సింగ్‌ కూడా ఇదివరకే స్పందించారు. 'క్రికెట్ ఆటగాళ్లు ఇష్టమైన ఆహారన్ని తినొచ్చు. పిజ్జాలు, బర్గర్లు తింటే తప్పేంటి. పాక్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు వారి ఆహారమే కారణమని చెప్పడం సరికాదు. మ్యాచ్‌ ముందు రోజు భోజనం చేయకుండా షికారు చేయడం మాత్రం సరైంది కాదు. ఇక ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి' అని హర్భజన్‌ అబిప్రాయపడ్డారు.

Story first published: Thursday, June 20, 2019, 12:27 [IST]
Other articles published on Jun 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X