న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. కష్టాల్లో కోహ్లీసేన

ICC Cricket World Cup 2019, India vs New Zealand Semi Final: Dinesh Karthik departs early, Jimmy Neesham caught Super Catch

ఐదు పరుగులకే టాపార్డర్‌ వికెట్లు కోల్పోయిన భారత్ మరో కీలక వికెట్ కోల్పోయింది. మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో జేమ్స్ నీషమ్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ (6; 25బంతుల్లో) పెవిలియన్ చేరాడు. దీంతో 24 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్‌ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్‌ (19), హార్దిక్ పాండ్యా (5)లు ఉన్నారు. భారత్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.

దీని నుంచి తేరుకోకముందే మాట్‌ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. హెన్రీ వేసిన 3.1వ బంతికి కేఎల్‌ రాహుల్‌ (1; 7 బంతుల్లో) ఔటయ్యాడు. కీపర్ టామ్‌ లేథమ్‌ అద్భుత క్యాచ్‌ పట్టాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది చాలదన్నట్టు భాద్యతగా ఆడాల్సిన కార్తీక్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్‌, హార్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో ఉన్నారు.

Story first published: Wednesday, July 10, 2019, 16:53 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X