న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీస్‌లో బెంచ్‌కే పరిమితమైన షమీ.. మండిపడ్డతున్న షమీ కోచ్‌

ICC Cricket World Cup 2019 : Shami's Coach Badruddin Slams Virat Kohli And Team Management
ICC Cricket World Cup 2019, India vs New Zealand: Mohammed Shamis Coach Slams Decision To Bench Fast Bowler


ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ పేసర్, హ్యాట్రిక్‌ హీరో మహ్మద్‌ షమీని పక్కన పెట్టి స్వింగ్ కింగ్ భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడినా.. ఎందుకు జట్టులోకి తీసుకోలేదంటూ షమీ కోచ్ బద్రుద్దీన్‌ సిద్ధిఖీ మండిపడుతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

చాలా ఆశ్చర్యపోయా:

చాలా ఆశ్చర్యపోయా:

తాజాగా బద్రుద్దీన్‌ సిద్ధిఖీ మాట్లాడుతూ... 'చాలా ఆశ్చర్యపోయాను. నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన వ్యక్తిని ఎలా పక్కన పెట్టగలరు. ఇంకా ఫాస్ట్‌ బౌలర్స్‌ నుంచి ఇంతకంటే మీరేం ఆశిస్తున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో పక్కన పెడితే.. కీలక సెమీస్ మ్యాచ్‌లకు ముందు తాజాగా ఉంచే ప్రయత్నం అని అనుకున్నా. కానీ నా అంచనా తప్పు అని తెలిసింది' అని సిద్ధిఖీ అన్నారు.

 బ్యాట్‌తో షమీకి ఏం పని:

బ్యాట్‌తో షమీకి ఏం పని:

'నిజానికి భువనేశ్వర్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలడని అతడిని ఎంచుకుంటే.. టాప్‌ 6 బ్యాట్స్‌మన్‌ బాగా ఆడినట్లయితే మిగతా వారితో పనేముంది. అసలు అది సరైన కారణమని అనుకోవట్లేదు. మ్యాచ్‌లో షమీ బాల్‌తో గెలిపించడమే. బ్యాట్‌తో షమీకి ఏం పని. టోర్నమెంట్‌ మొదట్లో అవకాశం ఇవ్వలేదు కాబట్టే తర్వాతి మ్యాచ్‌ల్లో తనేంటో నిరూపించుకున్నాడు. వెస్టిండీస్ మ్యాచ్ అనంతరం అతనితో మాట్లాడాను. అప్పుడు అతను బాగా ఫిట్ గా ఉన్నాడు. షమీకి తాజాగా గాయం అయి ఉంటే దాని గురించి మాత్రం నాకు తెలియదు' అని సిద్ధిఖీ పేర్కొన్నారు.

 అదే స్కోర్ వద్ద మ్యాచ్ మొదలు:

అదే స్కోర్ వద్ద మ్యాచ్ మొదలు:

మాంచెస్టర్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మంగళవారం మొదలైన మొదటి సెమీస్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్ బుధవారం కొనసాగనుంది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్‌ టేలర్‌ (67), లాథమ్‌ (3)లు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్ మొదలవుతుంది.

Story first published: Wednesday, July 10, 2019, 15:01 [IST]
Other articles published on Jul 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X