న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు అనుకూలించని వాతావరణం

ICC Cricket World Cup 2019, India vs New Zealand: Both teams will keep an eye on the weather in Nottingham where the threat of rain looms large

ప్రపంచకప్‌లో భాగంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ట్రెంట్‌ బ్రిడ్జ్ మైదానం వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. గత మూడు రోజులుగా ఇంగ్లాండ్ గడ్డపై వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైదానం చిత్తడిగా మారుతోంది. తాజా సమాచారం మేరకు వాతావరణం మ్యాచ్ జరగడానికి అంతగా అనుకూలించట్లేదట. ఈ రోజటి మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మొత్తం మ్యాచ్‌ జరిగేలా లేదు:

ఈ రోజు మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారం లాగే మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందట. ఒకవేళ మ్యాచ్ సమయానికి వర్ధం పడుకున్నా.. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పడే అవకాశం ఉందట. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌ మొత్తం జరిగేలా లేదు. ఇక టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌కి కూడా వర్షం అడ్డంకిగా మారింది. అయితే మ్యాచ్‌కు ఇంకా రెండు గంటల సమయం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు.

న్యూజిలాండ్‌కే లాభం:

న్యూజిలాండ్‌కే లాభం:

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే చెరో పాయింట్‌ లభిస్తుంది. ఇది న్యూజిలాండ్‌కే లాభం. ఎందుకంటే న్యూజిలాండ్‌ ఇప్పటికే మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. కివీస్ ఏడు పాయింట్లు సాధిస్తే సెమీస్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువవుతాయి. ఇక మిగిలిన ఐదింటిలో మూడు గెలిచినా.. సెమీస్‌లో తొలి రెండు స్థానాల్లో ఏదో ఒకటి సొంతం చేసుకుంటుంది.

రిజర్వ్‌ డే అసాధ్యం:

రిజర్వ్‌ డే అసాధ్యం:

ప్రపంచకప్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌.. బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. మరికొన్ని మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీ నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు 'రిజర్వ్‌ డే' ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే పెట్టడం అసాధ్యం. రిజర్వ్‌ డే రోజున కూడా వర్షం పడదని ఎవరూ హామీ ఇవ్వలేరు' అని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తెలిపింది.

1
43661
Story first published: Thursday, June 13, 2019, 14:49 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X