న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇరు జట్ల మధ్య గణాంకాలివే!: భారత్‌పై నెగ్గి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకునేనా?

ICC Cricket World Cup 2019: India vs Bangladesh ODI stats

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరాలని ఊవిళ్లూరుతోంది. మరోవైపు బంగ్లా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. ఇప్పటివరకు భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మొత్తం 35 వన్డేలు జరగ్గా ఇండియా 29 వన్డేల్లో విజయం సాధించగా... 5 వన్డేల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇక, ప్రపంచకప్ విషయానికి ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి.

ఈ మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా రెండింట విజయం సాధించగా.. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. అది కూడా 2007 ప్రపంచకప్‌లో. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటిమితో టీమండియా ఆ ప్రపంచకప్‌లో టోర్నీ లీగ్ స్టేజిలోనే నిష్క్రమించింది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో మళ్లీ ఇరు జట్లు మరోసారి తలపడటంతో ఇరు జట్ల మధ్య నమోదైన గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

అత్యధిక స్కోరు 370/4

అత్యధిక స్కోరు 370/4

370/4 - ఇరు జట్ల మధ్య నమోదైన అత్యధిక స్కోరు. 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఈ స్కోరు నమోదు చేసింది.

58 ఆలౌట్ - 2014 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు.

654 - ఇరు జట్ల మధ్య నమోదైన అత్యధిక పరుగులు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ పరుగులు నమోదు చేశాడు.

బంగ్లాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన సెహ్వాగ్

బంగ్లాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన సెహ్వాగ్

175 - 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెహ్వాగ్ నమోదు చేసిన స్కోరు. ఇరు జట్ల మధ్య ఓ ఆటగాడు నమోదు చేసిన ఆత్యధిక పరుగులివే.

17 - ఇరు జట్ల మధ్య నమోదైన సెంచరీలు.

3 - విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీలు. ఇరు జట్ల మధ్య ఓ ఆటగాడు నమోదు చేసిన అత్యధిక సెంచరీలు.

అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా గంగూలీ

అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా గంగూలీ

16 - సౌరవ్ గంగూలీ బాదిన సిక్సులు.

23 - మష్రఫె మొర్తాజా తీసిన వికెట్ల సంఖ్య. ఇరు జట్ల మధ్య ఓ బౌలర్ తీసిన అత్యధిక వికెట్లు ఇవే కావడం విశేషం.

6/4 - 2014 ప్రపంచకప్‌లో స్టువర్ బిన్నీ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

7 - ఇరు జట్ల మధ్య అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నాసిర్ హుస్సేన్ అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Monday, July 1, 2019, 17:17 [IST]
Other articles published on Jul 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X