న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ ఆస్ట్రేలియా మ్యాచ్.. 12 సిక్స‌ర్లు (వీడియో)

ICC Cricket World Cup 2019, India vs Australia: Two team batsmens hit 12 sixes in Match, Hardhik Pandya hit 3 sixes

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌ నష్టానికి 352 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా 316 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌లో మొత్తం 678 పరుగులు నమోదయ్యాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

668 పరుగులలో 12 సిక్స‌ర్లు నమోదయ్యాయి. ఇరు జట్ల బ్యాట్స్‌మన్‌లు కలిపి 12 సిక్స‌ర్లు బాదారు. ఇందులో భారత బ్యాట్స్‌మన్‌లు 8 సిక్స‌ర్లు బాదగా.. కేవ‌లం నాలుగు సిక్స‌ర్లు మాత్ర‌మే ఆసీస్ బ్యాట్స్‌మన్‌లు బాదారు. అత్యధికంగా హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా 3 సిక్స‌ర్లు బాదాడు. ఇక విరాట్‌ కోహ్లీ 2 సిక్స‌ర్లు కొట్టాడు. ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మలు చెరో సిక్స‌ర్ కొట్టారు. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్‌, స్టీవ్ స్మిత్‌, ఉస్మాన్ ఖ‌వాజా, అలెక్స్ క్యారీలు ఒక్కొ సిక్స్ కొట్టారు. ఈ సిక్స‌ర్ల వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

అయితే టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (117; 109 బంతుల్లో 16×4) అద్భుత సెంచరీ చేసినా.. ఒక్క సిక్స్ కూడా బాధలేదు. ఈ మ్యాచ్‌లో గబ్బర్ సిక్సులు కొట్టకున్నా.. బౌండరీలతోనే ఇన్నింగ్స్‌ను డీల్ చేసాడు. మరోవైపు ఆసీస్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (56; 84 బంతుల్లో 5×4) కూడా దాదాపు సగం ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. సిక్స్ మాత్రం బాధలేదు. కేవలం 5 బౌండరీలు మాత్రమే కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్‌ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్‌ చెరో 3 వికెట్లు తీశారు.

Story first published: Monday, June 10, 2019, 13:19 [IST]
Other articles published on Jun 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X